IIIT Basara: బాసర ట్రిపుల్ ఐటీలో మరో రచ్చ.. బయటపడిన వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ మధ్య విభేదాలు..
Basara: విద్యార్థుల ఆందోళనలతో గతేడాదంతా విశ్వవిద్యాలయంలో గొడవలు జరగ్గా, తాజా ఉన్నతాధికారుల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. తెలంగాణ వర్సిటీ తరహాలో ట్రిపుల్ ఐటీలోనూ అధిపత్య వివాదం మొదలైంది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ మధ్య విభేదాలు..

బాసర ట్రిపుల్ ఐటీ మళ్లీ ట్రబుల్ ఐటీగా మారుతోంది. విద్యార్థుల ఆందోళనలతో గతేడాదంతా విశ్వవిద్యాలయంలో గొడవలు జరగ్గా, తాజా ఉన్నతాధికారుల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. తెలంగాణ వర్సిటీ తరహాలో ట్రిపుల్ ఐటీలోనూ అధిపత్య వివాదం మొదలైంది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో గతేడాది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సతీష్ కుమార్‌ను ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా నియమించింది. విద్యార్థుల వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు ఆయనకు అప్పగించింది. ఈ క్రమంలో నెల క్రితం డైరెక్టర్ సతీష్ కుమార్ చెక్ పవర్ రద్దైంది. దీంతో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైంది.
మరో విద్యార్థుల సెలవులకు సంబంధించి కూడా వర్సిటీలో వివాదం చోటుచేసుకుంది. గత నెల నిర్వహించిన JEE పరీక్షలు రాసేందుకు కొంత మంది విద్యార్థులు అనుమతి తీసుకొని వెళ్లారు. అయితే హఠాత్తుగా వారిని హస్టల్ నుంచి చీఫ్ వార్డెన్ ఖాళీ చేయించారు. చీఫ్ వార్డెన్ వ్యవహరించిన తీరుపై డైరెక్టర్ సతీష్ కుమార్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల మధ్య విభేదాలు, సెలవులు, విద్యార్థుల విషయంలో వివాదాల కారణంగా ట్రిపుల్ ఐటీ మరోసారి ట్రుబుల్ ఐటీగా మారుతుందేమోనని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
