Telangana Election: బీజేపీ అధికారంలోకి వస్తే.. సీఎం బండి సంజయ్.. బాంబు పేల్చిన కర్ణాటక ఎమ్మెల్యే
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బండి సంజయ్‌ను కనివిని ఎరగని రీతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లింగసుగుర్ ఎమ్మెల్యే మానప్ప.

తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్స్ స్టేజీకి చేరుతోంది. అన్ని రాజకీయపార్టీలు ప్రచారం పర్వంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎమ్మెల్యే మానప్ప ఒజ్జల్ కరీంనగర్ జిల్లా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు లింగసుగుర్ శాసనసభ్యులు, కరీంనగర్ ఎన్నికల ఇంఛార్జీ మానప్ప ఒజ్జూర్.
రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ అసెంబ్లీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు మానప్ప. మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు తమకు నివేదికలు అందాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జూబ్లినగర్‌లో జరిగిన కరీంనగర్ రూరల్ మండల నాయకులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల విస్త్రతస్థాయి సమావేశంలో మానప్ప ఒజ్జల్ పాల్గొన్నారు. బండి సంజయ్ హార్డ్ వర్క్, కరీంనగర్ కార్యకర్తల కష్టపడే తత్వంవల్లే గెలుపు ఈజీగా మారిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని మానప్ప గుర్తు చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బండి సంజయ్‌ను కనివిని ఎరగని రీతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మానప్ప.
ఈ సంధర్బంగా ఎన్నికల జోనల్ ఇంఛార్జ్ కర్ణాటక ఎమ్మెల్సీ, కేశవప్రసాద్ బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని, తెలంగాణ అంతటా ప్రచారం చేయాల్సి ఉంటుందన్నారు. ఇకపై ప్రతి బూత్‌లో ప్రతి కార్యకర్త ఒక బండి సంజయ్‌లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారంతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప ఎన్నికల సమయంలో తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకేసారి వెళ్లి నామినేషన్ వేస్తారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తారు. పోలింగ్ బూత్ సభ్యులే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి యడ్యూరప్పను గెలిపిస్తారు. అందుకే యడ్యూరప్ప కర్ణాటకలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు కేశవప్రసాద్. తెలంగాణలోనూ బండి సంజయ్‌కు అత్యంత ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…