Covid-19: తెలంగాణ ప్రజలకు కొండంత ధైర్యం.. ICMR-NIN సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు

Covid-19: ఇక మీదట కరోనా వేవ్స్ తెలంగాణలో ప్రభావం చూపించలేవా? ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత, ఆక్సిజన్ లేక ప్రాణాలు పోవడం వంటి ఘటనలు ఉండవా?

Covid-19: తెలంగాణ ప్రజలకు కొండంత ధైర్యం.. ICMR-NIN సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు
Representative Image
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2022 | 2:41 PM

Covid-19: ఇక మీదట కరోనా వేవ్స్ తెలంగాణలో ప్రభావం చూపించలేవా? ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత, ఆక్సిజన్ లేక ప్రాణాలు పోవడం వంటి ఘటనలు ఉండవా? టోటల్ కరోనా వైరస్.. తెలంగాణ ప్రజలను ఏం చేయలేదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాచేసిన ICMR-NIN చేసిన సీరో సర్వే ఆసక్తికరమైన అంశాలను వెల్లడించడమే కాదు… వైరస్ ను ఎదిరించే కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.

కరోనా ఈ పేరు చెబితే… ఒకటి రెండు వేవ్ ల్లో ప్రజల భయాందోళనలు, మూడో వేవ్ లో కొంత తగ్గాయి. కానీ ఇవి ఇంకా పూర్తిగా పోలేదు. ఒక్కో సారి ఒక్కోలా వస్తున్న వార్తలు… భయాందోళనలు రేపుతునే ఉన్నాయి. మరోవైపు ఇంకా ఫోర్త్ వేవ్ వస్తోందని .. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎంటర్ అయిందనే వార్తలు ఉన్నాయి. కరోనా అనేది మనజీవితంలో ఒకభాగం ఒకమీదట… చాలా వేవ్ లను చూడాల్సిందేనన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఎంత కాలం కరోనా భయపడుతూ… బతకాలి.. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆప్‌ మెడికల్ రీసెర్చ్ ICMR లో భాగంగా ఉన్న నేషనల్ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్ NIN సీరో సర్వే దేశవ్యాప్తంగా చేపట్టింది. మందేలేని కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి యాంటి బాడీస్సే ప్రధానమైనవి .. ఇవి ఏ శాతంలో పెరిగితే…కరోనా నుంచి అంత ముప్పు లేనట్లే. కరోనాకు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నా.. దీని ద్వారా పెరగాల్సింది యాంటీబాడీసే.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. ICMR-NIN తో ఈ సర్వే చేయించింది. ఎందుకంటే.. మళ్లీ మళ్లీ కరోనాతో భయబ్రాంతులయ్యే పరిస్థితులు ఉంటే… ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆసుపత్రులు..ఆక్సిజన్ లు ఇలాంటి పరిస్థితులతో పాటు వ్యాపార ఉద్యోగాలు బ్రేక్ అవుతాయి. అందుకే ఇక్కడి ప్రజల్లో యాంటీ బాడీస్ శాతం ఎంత పెరిగింది. కరోనాను ఎదుర్కోనే శక్తి ఎంత కూడదీసుకున్నాం అనే సారాంశంతో ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు తెలంగాణ లో జరిగిన సీరో సర్వే దేశ వ్యాప్తంగా సర్వేల్లో ఒక భాగం కాదు. తెలంగా లోని 33 కొత్తజిల్లాల్లో గ్రామ గ్రామాన ఇంటింటి లో సాగిన సర్వే. వంద మందితో ప్రత్యేక బృందాలు నెల రోజుల పాటు ఈ సర్వే నిర్వహించాయి. ఏకంగా 18వేలకు పైగా రక్తనమూనాలు సేకరించారు. వీటిని తీసుకువచ్చిన తర్వాత మరో నెల రోజుల పాటు ఎనాలసీస్ చేసిన సర్వే ఇది..

ఇవి కూడా చదవండి

తెలంగాణ లో ఎన్‌ ఐ ఎన్ సర్వే కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఏకంగా 93శాతం మందిలో యాంటి బాడీస్ ఉన్నాయని వెల్లడైంది. అంటే.. మందులేని కరోనా వైరస్ కు యాంటిబాటీస్సే సరైన సమాధానం కాబోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో తెలంగాణ రాష్ట్రం పెద్ద నష్టాన్నే చూసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని వ్యవస్థలు స్థంభించి పోయాయి. రేపు ఏకాబోతోందనే భయాలు వెంటాడాయి.

సీరో సర్వేలో వెల్లడైన విషయాలతో ప్రభుత్వానికి చాలా భరోసా ఏర్పడింది. ప్రజల్లో ఈ స్థాయిలో యాంటీ బాడీస్ పెరగడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పుడు అంతమవుతుందో తెలీని కరోనా ఎన్ని వేవ్ ల్లో నైనా.. ఎన్ని వేరియంట్లలోనైనా రావచ్చు. కానీ యాంటీ బాడీస్ పెరిగితే.. ప్రాణ హాని లేదు. పాండమిక్ జాగ్రత్తలు తీసుకుంటే.. వైరస్ ను ప్రతి వేవ్ లోనూ జయించవచ్చని స్పష్టంచేస్తున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. ఈస్ధాయిలో యాంటీబాడీస్ పెరిగాయి కాబట్టి… ఎలాంటి భయాలు లేకుండా అనేక సెక్టార్లు ప్రారంభించుకోవచ్చునన్న సంకేతాలను ఆరోగ్య శాఖ ప్రభుత్వం తరుపున ఇవ్వగలింది. ఇప్పటివరకూ వర్క్ ఫ్రం హోం లో ఉన్న ఐటి లాంటిసెక్టార్లు ప్రారంభించుకోవచ్చని పిలుపునిస్తోంది తెలంగాణ ఆరోగ్య శాఖ.

ఇంతకీ NIN సీరో సర్వే ఏ ప్రాతిపదికన చేసింది. యాంటి బాడీస్ తెలంగాణ ప్రజల్లో 93 శాతం పెరగడానికి కారణం ఏంటి? భవిష్యత్ లో ఈ సర్వే ద్వారా కరోనాను ఎదుర్కొనే శక్తి ఎంత వరకూ వచ్చినట్లు? గతంలో చేసిన సర్వేలు ఒక ఎత్తు. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా చేసిన NIN సీరో సర్వే మరో ఎత్తు.. అంటున్న సీరో సర్వే టీమ్ కు నాయకత్వం వహించిన NIN ఎపడమాలజీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య. గతంలో దేశ వ్యాప్తంగా జరిగిన సర్వేల కంటే… చాలా లోతైన అధ్యయనం అంటున్నారాయన. 18వేలకు పైగా రక్తనమూనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని వయస్సుల వారి నుంచి సేకరించి… ఈ సీరో సర్వే చేశామంటున్నారు. ఈ సర్వే రిపోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అందించామని… దీని ద్వారా ఇక మీదట కరోనా భయాలు పోయి ఒక ధైర్యం ఏర్పడుతుందంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక మీదట కరోనాఎన్ని వేవ్ లు వచ్చినా … చికిత్సతో కోలుకోలుకుంటారనే భరోసా ఏర్పడింది. మరోవైపు కరోనా వస్తే చావేనా అనే భయాలు పటాపంచలు అవుతున్నాయి.

( వై. గణేష్‌, టివి9 తెలుగు, హైదరాబాద్)

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..