Telangana : వినాయక విగ్రహ ఏర్పాటు వివాదాస్పదం.. అక్కడ గ్లోబ్‌ ఏర్పాటుతో గొడవ.. ఉద్రిక్తత

ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ లో వినాయకుని విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో భారీ క్లాక్ టవర్ నిర్మాణంతో పాటు గ్లోబ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ..

Telangana : వినాయక విగ్రహ ఏర్పాటు వివాదాస్పదం.. అక్కడ గ్లోబ్‌ ఏర్పాటుతో గొడవ.. ఉద్రిక్తత
Andolana
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 01, 2022 | 3:02 PM

ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ లో వినాయకుని విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో భారీ క్లాక్ టవర్ నిర్మాణంతో పాటు గ్లోబ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి తో పాటు హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. బుధవారం చౌక్ కు పెద్ద ఎత్తున బిజెపి నేతలు, పలువురు హిందూ సంఘాల నాయకులు, యువకులు తరలిరావడం ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ, బిజెపి రాష్ట్ర నాయకులు చిట్యాల సుహాసిని రెడ్డి, బీజేవైఎం నేత రాళ్ళబండి మహేందర్ ల ఆధ్వర్యంలో యువకులు నిరసనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ శైలజ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

వినాయక్ చౌక్ లో వినాయకుని విగ్రహానికి బదులు గ్లోబ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. వినాయకుని విగ్రహానికి చందూరం పూసి ఆ వినాయకుని విగ్రహాన్ని చౌక్‌లో నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టౌన్ సీఐ శ్రీధర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చౌక్ లో యువకులు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో కొందరు యువకులు భారీ క్లాక్ టవర్ పైకి ఎక్కడంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పైకి ఎక్కేందుకు యత్నించిన మరికొందరు యువకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.. పైకెక్కిన యువకులు కొందరు వినాయకుని విగ్రహాన్ని క్లాక్ టవర్‌పై పెట్టడంతో అక్కడ ఒక్కసారిగా ఈలలు కేకలు చప్పట్లతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా టవర్ పైకెక్కిన యువకులు కిందికి దిగే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కిందికి దిగిన యువకులను పట్టుకొని చితకబాదారు. దీంతో ఒక్కసారిగా హిందూ సంఘాల నేతలు, బిజెపి నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఆందోళన నెలకొంది. చివరకు టవర్ ఎక్కిన యువకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే