YS Sharmila: కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. కేసీఆర్ ఇంటి ముందు: వైఎస్ షర్మిల
MLC Kavitha: మహిళా బిల్లులపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. BRS పార్టీలోనే 33% రిజర్వేషన్ పాటించడం లేదన్నారు.
మహిళా బిల్లులపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. BRS పార్టీలోనే 33% రిజర్వేషన్ పాటించడం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు, కాబట్టి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందంటూ విమర్శించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు కేసీఆర్ ఇంటి ముందుంటూ విమర్శలు చేశారు షర్మిల.
లిక్కర్ స్కాంపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శించారు షర్మిల. ఢిల్లీలో కవిత సోనియా గాంధీని పొగుడుతారు.. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తే వీళ్లంతా ఏకమవుతున్నట్టుగానే భావించాలని చెప్పుకొచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
