AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: “కేసులకు భయపడను బెదిరింపులకు బెదరను.. ప్రజలకు సేవ చేయాలని ముందడుగు వేశా”.. టీఆర్ఎస్ పై షర్మిల ఫైర్

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) హాట్ హాట్ గా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్, వైటీపీలు తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు...

YS Sharmila: కేసులకు భయపడను బెదిరింపులకు బెదరను.. ప్రజలకు సేవ చేయాలని ముందడుగు వేశా.. టీఆర్ఎస్ పై షర్మిల ఫైర్
Sharmila
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 19, 2022 | 7:40 PM

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) హాట్ హాట్ గా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్, వైటీపీలు తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. పాలకుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నది పులి బిడ్డ అని, తాను భయపడే రకం కాదని తేల్చి చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తల్లికి, చెల్లికి తేడా తెలియదని మాత్రమే తాను అడిగానని, మరదలు అని ఏ మహిళనైనా అనగలరా అని మండిపడ్డారు. తనతో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి కేసు పెడితే FIR ఫైల్ చేశారని చెప్పారు. అదే నిరంజన్ రెడ్డిపై పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తాను వైఎస్సార్ బిడ్డ అని, పోలీసు బేడిలకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. తన పాదయాత్రతో టీఆర్ ఎస్ నాయకుల బండారం బయటపడుతుందనే భయం అధికారపార్టీ నాయకుల్లో పట్టుకుందన్నారు వైఎస్.షర్మిల. దమ్ముంటే తన పాదయాత్రను ఆపాలని ఆమె టీఆర్ ఎస్ కు సవాల్ విసిరారు. ఎలా పాదయాత్ర ఆపుతారో తాను చూస్తానంటూ వ్యాఖ్యానించారు.

నా మీద కేసులు పెడతారట.. నన్ను అసెంబ్లీ కి పిలుస్తరట.. దమ్ముంటే నన్ను రమ్మని చెప్పండి. నడుచుకుంటూ వస్తా…కాలి నడకన వస్తా… తలెత్తుకొని వస్తా…ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీరు డేట్ ఇస్తారా…నన్ను డేట్ తీ సుకోమంటారా..? అసెంబ్లీ లోపలకు రావాలా…అసెంబ్లీ ముందుకు రావాలా. అసెంబ్లీ ముందు కూర్చొని పబ్లిక్ గా మాట్లాడతా.. ఏమి అడుగుతారో నన్ను అడగండి. నేను ఏమి తప్పు మాట్లాడానో అడగండి. మీ కేసులకు భయపడను… మీ బెదిరింపులకు బెదరను. ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ముందడుగు వేశా. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ బిడ్డ నిలబడే ఉంటుంది. మీరు అవకాశం ఇచ్చిన రోజు నమ్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో సేవ చేస్తా. అవకాశం ఇచ్చే వరకు మీకోసమే పోరాటం చేస్తా. ముఖ్యమంత్రి బిడ్డ ను అయి ఉన్న నా పిర్యాదు నే తీసుకోలేదు. ఇక సాధారణ మహిళ పరిస్థితి ఏంటి.. పోలీసులను కేసీఅర్ పనోళ్లుగా మార్చేశారు. బీజేపీ కి RSS ఎలాగో.. కేసీఅర్ కి ఈ పోలీస్ లు అలా మారారు.

ఇవి కూడా చదవండి

       – వైఎస్.షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు