Hyderabad: అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్.. బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్

అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పది. ఆపద సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సరైన బ్లడ్ ఇవ్వడం వల్ల వారి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే రక్తదానంపై చాలా మందికి అవగాహన లేదు. వారికి అవేర్ నెస్..

Hyderabad: అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్.. బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్
Blood Donation Camp
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 19, 2022 | 8:32 PM

అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పది. ఆపద సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సరైన బ్లడ్ ఇవ్వడం వల్ల వారి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే రక్తదానంపై చాలా మందికి అవగాహన లేదు. వారికి అవేర్ నెస్ కల్పించి ప్రోత్సహించడంలో స్వచ్చంధ సంస్థల పాత్ర చాలా ఉంది. వాటిలోనూ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహించే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి సమాజ శ్రేయస్సుకు తన వంతు పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డౌనేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. కూకట్ పల్లి, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్ బ్రాంచ్ లలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అఖిల్ భారతీయ తెరాపత్ యువక్ పరిషత్ వారు పాన్ ఇండియా స్ధాయిలో ఈ డ్రైవ్ చేపట్టారు. ఈ బ్లడ్ డొనేషన్ ని ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా చేసి “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు సంపాదించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి పాల్గొన్న ఏకైక విద్యా సంస్థగా “అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్” తన ప్రత్యేకతను చాటుకుందని ప్రిన్సిపాల్ నీతూచంద్ర తెలిపారు. విద్యాసంస్థల డీన్ శ్రీమతి సుశీల కందూరి, ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ ఉమా కొంపల్లి, హెచ్ ఓ డి. శ్రీమతి బిందు శ్రీనివాస్ గారు, ప్రగ్న్యా సేన్ గారు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. 2014 లో భారత రత్న స్వీకరించిన సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సినీ నటులు షారూఖ్ ఖాన్, రజనీకాంత్, చిరంజీవి వంటి ఇండస్ట్రీ పెద్దలు ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!