Hyderabad: భారత ఆర్మీ అమ్ముల పొదిలో మరో అస్త్రం.. బాలాకోట్ దాడుల తర్వాత మానవ రహిత విమానాలకు..
Hyderabad: భారత రక్షణ రంగ బలోపేతానికి, ఆధునిక సంపత్తిని అందిపుచ్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే క్రూయిజ్ క్షిపణులు, మానవరహిత విమానాలకు ఉపయోగించేందుకు అవసరమైన ఇంజిన్లను అభివృద్ధి చేస్తున్నారు...

Hyderabad: భారత రక్షణ రంగ బలోపేతానికి, ఆధునిక సంపత్తిని అందిపుచ్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే క్రూయిజ్ క్షిపణులు, మానవరహిత విమానాలకు ఉపయోగించేందుకు అవసరమైన ఇంజిన్లను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పనినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ఇటీవలే 4.5 కెఎన్ టర్బోజెట్ ఇంజిన్‌కు కాన్సెప్షియల్ వ్యాలిడేషన్‌ను పూర్తి చేసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన నమూనాలు పనినియన్ కంపెనీ రూపొందిస్తోంది. క్రూయిల్ క్షిపణుల నుంచి భారీ మానవ రహిత విమానాలకు ఉపయోగించేలా ఏరో ఇంజిన్లను అభివృద్ధి చేస్తున్నారు.
‘పనినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు రఘు అడ్ల ఈ విషయాన్ని తెలిపారు. ఇంజిన్ల తయారీల విషయంలో తాము రివర్స్ ఇంజనీరింగ్ చేయడం లేదని రఘు స్పష్టం చేశారు. 3-12 కెఎన్ మధ్య ఉన్న శ్రేణిలోని ఇంజిన్లను పనినియన్ అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి అవసరమైన పరీక్షల కోసం టెస్ట్‌బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు. 2019లో బాలాకోట్ దాడుల తర్వాత హైదరాబాద్‌కు చెందిన పనినియన్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేయం మొదలైంది. ఈ ఇంజిన్ల తయారీ కోసం జనరల్ ఎలక్ట్రిక్స్, రోల్స్‌రాయిస్ కంపెనీల్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారినిక నియమించుకోనున్నారు.



మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..