AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లగేజ్ బ్యాగులో మహిళ డెడ్‌బాడీ.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. వారెవ్వా

శివారులో డెడ్‌బాడీ. అది కూడా ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కేసి పడేశారు. చెట్లు, పుట్టలు తప్ప అక్కడ ఇంకేం లేవు. చంపిందెవరో తెలియదు.. ఆధారాల్లేకుండా నిందితులు జాగ్రత్తపడ్డారు. బట్.. ఖాకీలు సీన్‌లోకి ఎంటరయ్యాక ఆధారాలు ఒక్కొక్కొటిగా బయటికొచ్చాయి. హంతకుడ్ని పట్టించాయి. అసలు.. క్లూనే లేనిచోట.. పోలీసులు కూపీ ఎలా లాగారు? ట్రావెల్ బ్యాగ్ మాటున క్రైమ్‌ సీన్‌ని ఎలా రివీల్ చేశారు?

Hyderabad:  లగేజ్ బ్యాగులో మహిళ డెడ్‌బాడీ.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. వారెవ్వా
Bachupally Dead Body Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 05, 2025 | 6:13 PM

Share

హైదరాబాద్ పోలీసులు 24 గంటల వ్యవధిలో ఓ మర్డర్ కేసును పరిష్కరించారు. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్‌లో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పదింగా పడి ఉన్న ట్రావెల్ బ్యాగ్‌ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి బ్యాగు ఓపెన్ చేసి చూడగా.. లోపల ఒక యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, కేసును 24 గంటల్లో సాల్వ్ చేయడంతో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

దర్యాప్తులో మృతురాలు నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడు కూడా నేపాల్‌కు చెందిన విజయ్‌గా పోలీసులు నిర్ధారించారు. మే 23న వ్యక్తిగత విభేదాల కారణంగా విజయ్ యువతిని రూమ్‌లో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్య అనంతరం యువతి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి బాచుపల్లి ప్రాంతంలో పడేశాడు. కేసు ఛేదనలో సీసీటీవీ ఫుటేజ్‌ కీలకంగా ఉపయోగపడింది. అంతేకాకుండా.. గత 10 రోజులుగా ట్రావెల్ బ్యాగ్ కొన్న వారి వివరాలు సేకరించి.. సీసీ విజువల్స్ ద్వారా నిందితుడ్ని ట్రాక్ చేశారు. నిందితుడు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని ఓ షాపులో నుంచి బ్యాగ్ కొన్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విజయ్‌ను గుర్తించి.. అతని కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను హత్య ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఇద్దరూ సహజీవనం చేశారని… యువతి గర్భం దాల్చడంతో గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువతిని విజయ్ చంపేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో విజయ్‌కి ఎవరెవరు సహకరించారు? ఏయే రూపంలో హెల్ప్ చేశారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.