తెలంగాణలో కౌన్‌బనేగా టీపీసీసీ చీఫ్..? ఏ క్షణంలోనైనా అధిష్టానం తుది ప్రకటన..
గాంధీ భవన్ కొత్త బాస్ ఎవరు? బీసీ నేతకు ఛాన్స్ దక్కుతుందా? PCC కుర్చీపై ఏర్పడ్డ పీటముడి వీడినట్టేనా..? ఎన్నాళ్ల నుంచో తెలంగాణ కాంగ్రెస్‌ను వేధించిన ఈ ప్రశ్నలకు జవాబు దొరికేసింది. అధిష్టానంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల మంతనాలు కొలిక్కొచ్చేశాయి.
గాంధీ భవన్ కొత్త బాస్ ఎవరు? బీసీ నేతకు ఛాన్స్ దక్కుతుందా? PCC కుర్చీపై ఏర్పడ్డ పీటముడి వీడినట్టేనా..? ఎన్నాళ్ల నుంచో తెలంగాణ కాంగ్రెస్‌ను వేధించిన ఈ ప్రశ్నలకు జవాబు దొరికేసింది. అధిష్టానంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల మంతనాలు కొలిక్కొచ్చేశాయి. నాలుగు క్యాబినెట్ బెర్తులు కూడా ఖరారయ్యాయి. అనౌన్స్‌మెంట్ దగ్గరే ఆలస్యమౌతోంది.
కాంగ్రెస్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్.. అంటే ఆమామాషీ కాదు. రమారమి చీఫ్ మినిస్టర్ కుర్చీతో సమానం. పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పీసీసీ కుర్చీ కోసం.. నాయకులంతా తహతహ లాడతారు. లక్షలాదిమంది కార్యకర్తల్ని, వందలాది మంది నాయకుల్ని లీడ్ చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల్ని కట్టడి చేసే అవకాశమున్న పీసీసీ పదవి.. ఇప్పుడు తెలంగాణలో ఖాళీగా ఉంది. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీనెక్కినప్పటినుంచి.. పీసీసీ కుర్చీ రీప్లేస్‌మెంట్ కోసం లోపల్లోపల కసరత్తు జరుగుతూనే ఉంది.
తాజాగా రేవంత్ అండ్ భట్టి ఢిల్లీ టూర్ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎవరనే టాపిక్ వేడెక్కింది. ఇప్పటికే ఈ అంశంపై అనేకసార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. తాజాగా ఏఐసీసీ అగ్రనేతలతో మళ్లీ సమావేశమై.. దాదాపు గంట సేపు చర్చించారు. పీసీసీ లాంటి బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ అని… అటు అధిష్టానం ఇటు సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం. మహేష్‌కుమార్ గౌడ్ బీసీ నేత కావడంతో… ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పీసీసీ రేసుపై హస్తినలో జరిగిన సుదీర్ఘ మంతనాల్లో వేరువేరు సామాజిక వర్గాలనుంచి ఐదారు పేర్లు గట్టిగా వినిపించాయి. వీళ్లందరిపై రేవంత్, భట్టి, ఉత్తమ్ నుంచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకుంది అధిష్టానం. బీసీ కోటా విషయంలో మహేష్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ గౌడ్ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. కానీ.. ఎక్కువమంది మహేష్‌వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీలోనే ఉంటూ విశ్వాసపాత్రుడిగా పేరుతెచ్చుకున్న మహేష్‌కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.
ఎస్సీల ప్రస్తావన వచ్చినప్పుడు.. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే సంపత్.. ఇద్దరూ పోటీపడ్డారు. ఎస్‌టీలకు ఇవ్వాల్సి వస్తే ఏంటి అన్నప్పుడు బలరామ్‌నాయక్ పేరు ప్రధానంగా వినిపించింది. ఎస్‌సీలకివ్వాలా.. బీసీలకివ్వాలా.. అనే డైలమా కూడా కొనసాగింది. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండడం కూడా బీసీ నేత మహేష్ వైపు మొగ్గుచూపినట్టుంది అధిష్టానం. పీసీసీ చీఫ్‌తో పాటు.. నాలుగు క్యాబినెట్ పదవుల భర్తీ విషయంలో కూడా అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేసింది. తుది ప్రకటన రావడమే తరువాయి.