AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peerzadiguda Gambling: పిర్జాదీగూడ పేకాట వివాదంలో బిగ్ గేమ్.. ఆ ప్లాన్ ప్రజాప్రతినిధులదా.. పోలీసుదా అన్నదే సస్పెన్స్‌

పిర్జాదీగూడ పేకాట వివాదంలో బిగ్ గేమ్ ప్లాన్.. ఆ గేమ్ ప్లాన్ ప్రజాప్రతినిధులదా.. పోలీసుదా అన్నదే సస్పెన్స్‌. మీడియాపై దాడి చేసింది ఎవరు? ఆ డైవర్షన్‌తో పేకాటరాయుళ్లను తప్పించింది ఎవరు? ఇప్పుడు ఇదే పెద్ద కాంట్రవర్శీ. ఇందులోని కంటెంట్ పూర్తిగా అర్థం కావడంలేదా..? మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో మొత్తం జరిగిన హైడ్రామా ఏంటో ఓసారి చూద్దాం. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వొచ్చు.. జరిగిన మాయ ఏంటో ! చేసింది ఎవరో !

Peerzadiguda Gambling: పిర్జాదీగూడ పేకాట వివాదంలో బిగ్ గేమ్..  ఆ ప్లాన్ ప్రజాప్రతినిధులదా.. పోలీసుదా అన్నదే సస్పెన్స్‌
Peerzadiguda Pekata
Sanjay Kasula
|

Updated on: Jan 30, 2023 | 7:38 AM

Share

హైదరాబాద్‌ సిటీ శివారు మున్సిపాలిటీ పిర్జాదీగూడలో జరిగిన సీన్ ఇది. ఆదివారం మధ్యాహ్నం 3గంటల టైమ్‌లో కో ఆప్షన్ మెంబర్, బిల్డర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఆఫీస్‌కి కొంతమంది ప్రముఖులు వచ్చారు. వాళ్లలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కొప్పుల అంజిరెడ్డి సహా మొత్తం ఆరుగురు కార్పోరేటర్లు ఉన్నారు. మరికొందరు కార్పోరేటర్ల భర్తలు ఉన్నారు. కొంతమంది బడా బిల్డర్లు ఉన్నారు. మొత్తం 12, 13 మంది కలిసి పేకాట దుకాణం పెట్టారు. ఈ విషయం ఎవరో ఉప్పందించడంతో సరిగ్గా రాత్రి 7గంటల తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మామూలుగా అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి. కానీ ఇక్కడే బిగ్ మిస్టరీ కనిపించింది. లోపలికి వెళ్లిన పోలీసులు షట్టర్ క్లోజ్ చేశారు. ఎనిమిది, ఎనిమిదిన్నవరకూ లోపల ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత మెయిన్ పోలీసులు వెళ్లిపోయిన్నట్లుగా కనిపించింది. లోపల ముగ్గురో, నలుగురో ఎస్‌ఓటీ పోలీసులు మాత్రం మిగిలారు.

మీడియా వెళ్లిపోతే అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నారో.. తప్పిద్దాం అనుకున్నారోగానీ మీడియా మాత్రం కదల్లేదు. ఈలోగా కరెంట్ పోయింది. విచిత్రం ఏంటంటే.. పిర్జాదీగూడ మొత్తం పవర్ ఉంది. కేవలం ఆ ప్రాంతంలోనే కరెంట్ పోయింది. నాలుగు గంటల పాటు కరెంట్ రాలేదు. మీడియా అప్పటికీ కదలకపోవడంతో సదరు ప్రజాప్రతినిధుల అనచరులు పదులసంఖ్యలో వచ్చారు. మీడియాపై దాడి చేశారు. దాడి కారణంగా కనీసం కెమెరాలు బయటకు తీసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందట్లో జరగాల్సిన మాయ జరిగిపోయింది. సడెన్‌గా షట్టర్ ఎత్తేశారు. లోపల ఉన్న ప్రజాప్రతినిధులు బిల్డర్లు టూవీలర్స్‌పై వెళ్లిపోయారు.

ఇక్కడే టీవీ9 ఎక్స్‌క్లూజివ్ స్ట్రోరీ మీకోసం తీసుకొచ్చాం. పేకాటపై రెయిడ్స్‌ జరిగిన వెంటనే టీవీ9 అక్కడి దృశ్యాలు చిత్రీకరించింది. అందులో లిక్కర్‌ సహా కన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తోంది. పవర్‌ కట్‌ టైమ్‌లో అర్థరాత్రి 1గంట తర్వాత అందర్నీ తప్పించాక.. నీట్‌గా సర్దేసిన దృశ్యాలూ మీరు చూడొచ్చు..

బ్రేకింగ్‌కి కారణమైన అసలు కంటెంట్ మీకు అర్థమైపోయింది ఉంటుంది. ఎవరు ఏం మాయ చేశారో మీరూ ఊహించగలరు. కానీ పోలీసుల పాత్ర ఎంతవరకూ ఉంది. వాళ్లని తప్పిందించింది పోలీసులేనా? దీనిపై మరింత సమాచారం రంజిత్ అందిస్తారు. రంజిత్ చెప్పండి.. పోలీసు పాత్రపై అనుమానాలకు తావిస్తున్న కారణాలేంటి..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం