Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..

ఎవరు మంచివారు.. ఎవరు కాదు.. అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా సరే.. ఇంటికొచ్చి.. కొంచెం అది ఉంటే ఇవ్వండి.. ఇది ఉంటే ఇవ్వండి.. అంటూ అడిగితే.. జాగ్రత్త.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.!

Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
Hyderabad
Follow us
Ranjith Muppidi

| Edited By: Ravi Kiran

Updated on: Mar 12, 2025 | 7:26 PM

కొందరు ఈజీమనీకి అలవాటు పడి.. వ్యసనాల మత్తులో జోగుతూ దొంగతనాలు, దోపిడీల బాట పడుతున్నారు. ప్రతిఘటిస్తే ఎంతదూరం అయినా వెళ్లేందుకు వెనకాడటం లేదు. అసలు ఎదుటి వ్యక్తికి ఏదైనా సాయం చేయాలన్నా వెయ్యిసార్లు ఆలోచించే రోజులు వచ్చాయి. సాయం చేసిన వ్యక్తుల్నే చీట్ చేయడం, మాయ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా హైదారాబాద్ కూకట్‌పల్లిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

KPHB సమీపంలో నివాసం ఉండే ఓ మహిళ ఉదయాన్నే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేస్తోంది. మరి అకస్మాత్తుగా ఆమె కనిపించిందో.. ముందుగానే రెక్కీ చేసుకున్నాడో తెలియదు కానీ.. ఒకడు మంకీ క్యాప్ పెట్టుకుని ఆ ఇంటి వద్దకు వచ్చాడు. అమ్మా.! దాహంగా ఉంది మంచినీళ్లు ఉంటే ఇస్తారా అని బాటిల్‌ పట్టుకుని అడిగాడు. పాపం ఆ మహిళ దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు ఉన్నాడు.. దాహమేసినట్లుంది అని ముగ్గు గిన్నె ఇంట్లో పెట్టి.. మంచినీళ్లు ఇచ్చేందుకు ఇంట్లోకి వచ్చింది. ఆమె వెంటే అనుసరించిన దుండగుడు.. గేటు లోపలికి వచ్చి.. గుమ్మం వద్ద ఆగి కర్టెన్ తీసి.. లోపలికి వంగి బాటిల్ ఇస్తున్నట్లు నటించాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి.. లోపలికి వెళ్లి ఆమె మెడలో బంగారం లాక్కుని పరారయ్యాడు. ఈ పరిణామాన్ని అస్సలు ఊహించని ఆ మహిళ కంగుతింది. అతని వెనక ఆమె కూడా పరుగులు తీసింది. ఆ ఆగంతకుడు.. వెళ్తూ గేటు మూసేయ్యడంతో.. ఆమె బయటకు వెళ్లేలోపే వాడు కనిపించకుండా పరారయ్యాడు. ఈ దొంగ వ్యవహారం అంతా ఆ ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డయింది.

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే