Telangana: పని కన్నా రాజకీయాలు ఎక్కువయ్యాయి.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్స్

కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. సీఎం కేసీఆర్ పాలన తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు...

Telangana: పని కన్నా రాజకీయాలు ఎక్కువయ్యాయి.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్స్
Prahlad Joshi News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 23, 2022 | 7:54 PM

కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. సీఎం కేసీఆర్ పాలన తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పని కన్నా రాజకీయాలు ఎక్కువ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ అని ఆరోపించారు. బియ్యం రీ సైక్లింగ్ లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారనన్న కేంద్ర మంత్రి.. నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం లు ఇవ్వడం లేదని, అవాస్ యోజన ఇల్లు కట్టడం లేదని మండిపడ్డారు. ఎంఐఎం తో కలిసి మెట్రో రైలు సర్వీసులను పాత బస్తీకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. కాగ్ రిపోర్ట్ పై కేసీఆర్, కేటీఆర్ రిప్లై ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని అన్న కేసీఆర్.. అయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. హైదరాబాద్ బీజాపూర్ హై వే కు భూ సేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదు. 2017 లో కేంద్రం రూ.924 కోట్లు కేటాయించింది. అయుష్మన్ భారత్ మూడేళ్ల తరవాత అమలు చేస్తున్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సరిగా అమలు చేయడం లేదు..నిధులు మళ్లిస్తున్నారు. తెలంగాణ అంటే తన కుటుంబమే అని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయనకు తెలంగాణలో డబ్బులు ఎక్కువ జాతీయ రాజకీయాలని అంటున్నారు. ఎవరొచ్చినా ప్రధాని మోడీని ఏమీ చేయలేరని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు చెబుతున్నాయి.

– ప్రహ్లాద్ జోషీ, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి మోడీని కవర్‌ చేసే పనిలో ఆర్థికమంత్రి బిజీగా ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు. ‘రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంది. కానీ మేడమ్ FM (ఆర్థిక మంత్రి) PDS షాపుల్లో PM ఫొటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు. రూపాయి దాని సహజ స్థితికి చేరుకుంటుందని ఆమె మీకు చెబుతుంది. అన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం యాక్ట్స్ ఆఫ్ గాఢ్‌లో భాగమే. విశ్వ గురువు గారికి నమస్కారం’ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..