Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: మొన్న చేవెళ్ల, ఖమ్మం.. ఇప్పుడు హైదరాబాద్‌.. మరోసారి తెలంగాణకు అమిత్ షా రాక.. ఎప్పుడంటే.?

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఎంత ఫోకస్డ్‌గా ఉందో తెలియాలంటే అమిత్‌షా వరుస టూర్లు చూస్తే అర్థమవుతుంది. గతనెల 27నే తెలంగాణకు వచ్చి వెళ్లారు అమిత్‌షా. ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించి, తెలంగాణ కాషాయ దళానికి ఎలక్షనోపదేశం చేశారు. అంతకుముందు చేవెళ్లలో.. ఇప్పుడు మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.

Amit Shah: మొన్న చేవెళ్ల, ఖమ్మం.. ఇప్పుడు హైదరాబాద్‌.. మరోసారి తెలంగాణకు అమిత్ షా రాక.. ఎప్పుడంటే.?
Union Home Minister Amit Shah
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 13, 2023 | 7:36 AM

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఎంత ఫోకస్డ్‌గా ఉందో తెలియాలంటే అమిత్‌షా వరుస టూర్లు చూస్తే అర్థమవుతుంది. గతనెల 27నే తెలంగాణకు వచ్చి వెళ్లారు అమిత్‌షా. ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించి, తెలంగాణ కాషాయ దళానికి ఎలక్షనోపదేశం చేశారు. అంతకుముందు చేవెళ్లకు వచ్చి విజయసంకల్పం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఖమ్మంకి వచ్చి వెళ్లి కనీసం 20రోజులు కూడా తిరక్క ముందే మళ్లీ హైదరాబాద్‌ వస్తున్నారు. అదీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం రోజు!. అంటే సెప్టెంబర్ 17వ తేదీన అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ప్రతి సందర్భాన్నీ తమను అనుకూలంగా మలుచుకుంటోన్న బీజేపీ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వినియోగించుకునేందుకు వ్యూహరచన చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ విమోచన దినోత్సవాన్ని మరింత హైలెట్ చేస్తూ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకే హైదరాబాద్‌ వస్తున్నారు అమిత్‌ షా.

ముందు ఫిక్స్ అయిన షెడ్యూల్‌ ప్రకారమైతే అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్‌ రావాల్సి ఉంది. అయితే, ఒక్కరోజు ముందే, అంటే సెప్టెంబర్ 16న రాత్రికే వస్తారంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పదహారున రాత్రి ఏడు గంటల 55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు అమిత్‌షా. అక్కడ్నుంచి రోడ్డుమార్గం ద్వారా సీఆర్పీఎఫ్‌ సెక్టార్స్‌కు చేరుకొని బస చేస్తారు. తర్వాతి రోజు సికింద్రాబాద్‌ పరేడ్స్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఇక, ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అమిత్‌షా మెయిన్‌ టార్గెట్‌ మాత్రం కేసీఆర్‌ అండ్ ఓవైసీనే!. చేవెళ్ల, ఖమ్మం సభల్లో కేసీఆర్‌ అండ్‌ పరివార్‌ టార్గెట్‌గానే నిప్పులు చెరిగారు. అంతేకాదు, బీజేపీ అధికారంలోకొస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ప్రకటించారు. మరి, ఈసారి ఎలాంటి సంచలన ప్రకటనలు ఉంటాయో!. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారో చూడాలి!.

విద్యార్ధులు, యువత, నిరుద్యోగులకు అండగా నిలుస్తూ.. సెప్టెంబర్ 13న కిషన్ రెడ్డి సారధ్యంలో ఇవాళ తెలంగాణ బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష చేపడుతోంది. అందుకు సంబంధించిన ట్వీట్ ఇలా..

సెప్టెంబర్ 15- 17, అలాగే సెప్టెంబర్ 17- అక్టోబర్ 02 వరకు తెలంగాణ బీజేపీ కార్యాచరణ ఇలా ఉంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..