AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే పరుగులు..!

హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ నుంచి మరో శుభవార్త అందింది. త్వరలో నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నగరవాసులకు రద్దీ లేని ప్రయాణాన్ని ఇవి అందించనున్నాయి. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలోనే ఆర్టీసీకి విద్యుత్ బస్సుల పంపిణీ జరగనుంది.

TGSRTC: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే పరుగులు..!
Tgsrtc Buses
Venkatrao Lella
|

Updated on: Dec 26, 2025 | 7:11 AM

Share

హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా నగరానికి 2 వేల విద్యుత్ బస్సులు రానున్నాయి. వీటిని త్వరలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టీసికి ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసేందుకు కేంద్రం ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లలో 2 వేల బస్సులను అందించేందుకు మేఘా సంస్థకు చెందిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, గ్రీన్‌సెల్‌ మొబిలిటీ సంస్థలు అర్హత సాధించాయి. ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 1085 బస్సులను అందించనుండగా.. 915 సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను పంపిణీ చేయనుంది.

ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. అయితే ఇటీవల న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఇప్పుడు బిడ్లను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఆర్టీసికి అందించేందుకు రెండు సంస్థలకు అనుమతి రావడంతో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నాయి. అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీకి సరఫరా చేయనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా హైదరాబాద్ ప్రజల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. జనవరిలోనే ఈ కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో రద్దీకి తగ్గట్లు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పీక్ అవర్స్‌లో నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒకవేళ బస్సులో జనం ఫుల్‌గా ఉంటే నెక్ట్స్ బస్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది.

అద్దె ఎంత..?

అద్దె ప్రతిపాదికన కంపెనీలు ఆర్టీసీకి బస్సులను అందించనున్నాయి. కిలోమీటర్‌కు ఎంత అద్దె అనే విషయంపై కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. అద్దె తగ్గించాలని కంపెనీలను కేంద్రం కోరుతోంది. వారం, పది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుండగా. . ఆ తర్వాత పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,878 బస్సులు సేవలు అందిస్తుండగా.. 2039 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువగా డిజిల్ బస్సులే ఉన్నాయి. డిజిల్ రేట్లు ఎక్కవగా ఉండటం వల్ల ఆర్టీసీకి భారం ఎక్కువ పడుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులు ఉంటే డిజిల్ ఖర్చు తగ్గడం వల్ల ఆర్టీసీకి కూడా నిధులు ఆదా అవుతాయి. అలాగే పర్యావరణపరంగా కూడా లాభం చేకూరుతుంది.

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!