Hyderabad: అన్నను కాపాడబోయి తమ్ముడు.. అతన్ని బతికిద్దామని స్నేహితుడు.. పాపం ముగ్గురూ కళ్లదుటే..
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మరణించారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ విషాద ఘటన నగరంలోని షేక్‌పేట పారామౌంట్ కాలనీలో జరిగింది.
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మరణించారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ విషాద ఘటన నగరంలోని షేక్‌పేట పారామౌంట్ కాలనీలో జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనస్ (19) తమ ఇంట్లో ఉన్న మోటారు స్విచ్ ఆన్ చేసేందుకు యత్నించగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడే, సమీపంలోనే ఉన్న రిజ్వాన్ (18).. తన అన్నను కాపాడేందుకు ప్రయత్నించాడు. అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇదే తరుణంలో అన్నదమ్ములను రక్షించేందుకు పక్కనే ఉన్న స్నేహితుడు రజాక్ (16) ప్రయత్నించాడు.. అతను కూడా కరెంట్ షాక్‌కి గురయ్యాడు. దీంతో ముగ్గురూ ఘటనాస్థలంలోనే కుప్పకూలి చనిపోయారు.
ఈ ఘటనతో టోలిచౌకి పారామౌంట్ కాలనీలో విషాదం అలుముకుంది. మృతిచెందిన యువకుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం