AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MMTS: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న ఎంఎంటీఎస్‌ కొత్త లైన్స్‌

ఈ క్రమంలోనే తాజాగా ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించే దిశగా రైల్వే అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే సనత్‌నగర్‌ - మౌలాలి లైన్‌ సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో...

MMTS: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న ఎంఎంటీఎస్‌ కొత్త లైన్స్‌
MMTS Hyderabad
Narender Vaitla
|

Updated on: Feb 12, 2024 | 10:37 AM

Share

తక్కువ ధరలో ప్రయాణికులకు వేగమైన ప్రయాణం అందిస్తున్న వాటిలో ఎంఎంటీఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగర నలుమూలల నుంచి అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలు ఎంతో మంది వేతన జీవులకు ఉపయోగకరంంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగుల నుంచి రోజువారీ కూలీల వరకు ఈ రైలు సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించే దిశగా రైల్వే అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే సనత్‌నగర్‌ – మౌలాలి లైన్‌ సిద్ధమైంది. రక్షణశాఖ – రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది.

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో సనత్‌ నగర్‌- మౌలాలి మార్గాన్ని ప్రారంభించనున్నారు. అయితే మరో ఎంఎంటీఎస్‌ మార్గమైన సికింద్రాబాద్‌ – ఘట్‌కేసర్‌ లైన్‌ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు లైన్లు అందుబాటులోకి వస్తే నగర ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.

మల్కాజిగిరిలో ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు.. పేరు హైదరాబాద్‌లో ఉన్నా సొంతిళ్లకు దూరంగా ఉంటూ, కంపెనీలకు సమీపంలో అద్దె తీసుకొని ఉండే పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మౌలాలి-సనత్‌నగర్ ఎంఎంటీఎస్ మార్గంతో ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సమయం తగ్గనుంది. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌సిటీ మార్గం సుగుమమం కానుంది. మౌలా నుంచి సనత్‌నగర్‌ల మధ్య అందుబాటులోకి రానున్న ఎంఎంటీఎస్‌తో వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు తక్కువ ఛార్జీలతో ప్రయాణం పొందే అవకాశం లభించనుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..