AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చరిత్రను వక్రీకరిస్తున్నారు.. ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారు.. టీఆర్ఎస్, బీజేపీ పై రేవంత్ ఫైర్

దేశానికి, తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ (Congress) పార్టీనేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 ను నిర్వహించని టీఆర్ఎస్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ...

Telangana: చరిత్రను వక్రీకరిస్తున్నారు.. ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారు.. టీఆర్ఎస్, బీజేపీ పై రేవంత్ ఫైర్
Revanth Reddy
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Sep 17, 2022 | 3:59 PM

Share

దేశానికి, తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ (Congress) పార్టీనేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 ను నిర్వహించని టీఆర్ఎస్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాట ఫలితంగానే ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. అమరులను, వీరులను స్మరించుకుంటూ, వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటి వీరుల త్యాగాలు, వారిని స్ఫూర్తిని తీసుకొని నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బైరాంపల్లి ఘటనలు తెలంగాణాలో చాలా జరిగాయన్న రేవంత్ (Revanth Reddy).. భూమి కోసం భుక్తి కోసం దండు కట్టి, దళంగా కదిలి, వేలాది మంది వీరులు పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారని ఆవేదన చెందారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు.

వల్లభభాయ్ పటేల్ ఉప ప్రధాని గా ఉన్న సమయంలో దేశంలో వందల సంఖ్యలో సంస్థానాలున్నాయి. కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం అయ్యాయి. కానీ హైదరాబాద్ కలవలేదు. గుజరాత్ లోని జునాగఢ్ కూడా భారత్ లో కలవలేదు. పాకిస్థాన్ లో కలిసేందుకే అక్కడి రాజు అంగీకరించాడు. ఆ రాజు కూడా ముస్లిం రాజే. సర్దార్ వల్లభభాయ్ పటేల్ వెళ్లి ఆ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఎందుకు వేడుకలు చేయడం లేదో కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. ముస్లిం, హిందువుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో జరుగున్న వేడుకలకు అమిత్ షా వచ్చారు. ఆ నాటి హోమ్ శాఖ మంత్రి పటేల్.. నెహ్రు ఆదేశాల మేరకు చేశారు. సాయుధ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ అప్పటికీ పుట్టనే లేదు.

       – రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా బీజేపీపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను బీజేపీ దొంగిలించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 1950 లో గాంధీ భవన్ కు పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని చెప్పారు. పటేల్ కు దండేసే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని మండిడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతున్న బీజేపీ దేశంలో విస్తరించడానికి కుట్రలు చేస్తోందని ఆక్షేపించారు. ఇక కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీ గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందే శ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా మారుస్తానమన్న రేవంత్.. సబ్బండ వర్గాల ప్రజల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామన్నారు. నమూనా ను నేడు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్