Hyderabad: డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ కూడా.. పోలీసులు నిర్దారణ
కొకైన్, ఖద్దర్ కలిసింది. డ్రగ్స్ మారో డ్రగ్స్ అంటూ చిందేసింది. డ్రగ్స్ పార్టీ చేసుకుంది 10మంది. దొరికింది ముగ్గురు. మిగిలిన ఏడుగురు ఎక్కడ? వేరీజ్ డ్రగ్స్ సప్లయర్..? ఇదే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. కొకైన్, ఖద్దర్‌కు సినిమా సెలబ్రిటీలు కూడా తోడయ్యారు.
రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు తేల్చారు పోలీసులు. పెడ్లర్ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్ పేరు ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతోపాటు.. రాడిసన్ హోటల్‌లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు తెలిపారు. గజ్జెల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరైన పోలీసులు నిర్ధారించారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు కన్ఫామ్ చేయాల్సి ఉంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.
కొకైన్, ఖద్దర్ కలిసింది. డ్రగ్స్ మారో డ్రగ్స్ అంటూ చిందేసింది. డ్రగ్స్ పార్టీ చేసుకుంది 10మంది. దొరికింది ముగ్గురు. మిగిలిన ఏడుగురు ఎక్కడ? వేరీజ్ డ్రగ్స్ సప్లయర్..? ఇదే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
తీగ లాగితే కొకైన్ డొంక కదులుతోంది. హైదరాబాద్ మత్తు కథా చిత్రమ్‌లో కొత్త కోణాలు కలవరం రేపుతున్నాయి. కలకలం పుట్టిస్తున్నాయి. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు. ఫ్రెండ్స్‌తో డ్రగ్స్ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద అంగీకరించారు. ఖాకీ ఇంటరాగేషన్‌లో ఖతర్నాక్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్భయ్, రఘుచరణ్, కేదార్, సందీప్, శ్వేత, లిశి, నీల్, క్రిష్‌లతో కలిసి వివేకానంద డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. సయ్యద్ అబ్బాస్ జఫ్రీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశామని పోలీస్ విచారణలో వివేకానంద చెప్పినట్లు సమాచారం. ఇక డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వీరిలో వివేకానందను బీజేపీ నేత కుమారుడిగా గుర్తించారు పోలీసులు. నిందితులు కొకైన్ ని పేపర్ రోల్ లో చుట్టి సేవించినట్లు గుర్తించారు పోలీసులు
ఆదివారం అర్ధరాత్రి రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితులు అప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. కొకైన్ సేవించేందుకు ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్ రోల్స్ స్వాధీనం చేసుకున్నారు. వివేకానందను.. డ్రగ్ ఐడెంటిఫికేషన్ మిషన్‌తో టెస్ట్ చేయగా వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్..కొకైన్ తీసుకున్నట్లు తేలిందన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. హోటల్ సెల్లార్ పార్కింగ్ నుంచి కారులో నిందితులు పారిపోయారని… నిందితులు పారిపోయేందుకు హోటల్ సిబ్బంది ఏమైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఇప్పుడు సప్లయర్ సయ్యద్ దొరికితే…ఈ కొకైన్ ఎక్కడి నుంచి వస్తోంది? దీని వెనుక అసలు బాస్ ఎవరు? హైదరాబాద్ నెట్‌వర్క్‌లో కీ ఆపరేటర్స్ ఎవరు?…జనాన్ని మత్తు సముద్రంలో ముంచేస్తున్న డ్రగ్ షార్కులెవరో తేలుతుందంటున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..