Hyderabad: డ్రగ్స్ సప్లై కేసులో లేడి కిలాడి అనురాధ అరెస్ట్.. ఈజీ మనీ కోసం డ్రగ్ ఫెడ్లర్‌గా మారిన వైనం
హైదరాబాద్లో పోలీసులు డ్రగ్స్ పై గట్టి నిఘా ఉంచారు. వరుసగా దాడులకు పాల్పడుతూ డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా కాపుగాచి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి..
హైదరాబాద్, సెప్టెంబర్ 11: హైదరాబాద్లో పోలీసులు డ్రగ్స్ పై గట్టి నిఘా ఉంచారు. వరుసగా దాడులకు పాల్పడుతూ డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా కాపుగాచి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు క్షమిస్తూ ఉన్నారు ఇందుకోసం నెట్వర్క్ లను చేదిస్తూ వస్తున్నారు. తాజాగా మోకిలా పోలీసులతోపాటు రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మరో డ్రగ్ ఫైడ్లింగ్ గ్యాంగ్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ చేతులు మారుతుందన్న పక్కా సమాచారంతో వలపన్ని ముగ్గురు నిందితలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 48 గ్రాముల MDMA, మరొక ఎనిమిది గ్రాముల క్రషింగ్ mdma, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. ఈ గ్యాంగ్ లో అనురాధ అనే లేడి కీలకంగా ఉంది. ఈమె భర్త నుండి డైవర్స్ తీసుకున్న అనూరాధ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో రెగ్యులర్ గా గోవా కు వెళ్తూ ఉంటుంది. గోవాలో అనురాధకు జేమ్స్ అనే నైజీరియన్ పరిచయమయ్యాడు. గోవాలో డ్రగ్ ఫేడ్లర్ ఉన్న జేమ్స్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చింది. రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన అనురాధ ఇక్కడే కొంతమంది కన్జ్యూమర్లకు విక్రయిస్తోంది.
గోవా నుండి తీసుకొచ్చిన డ్రగ్స్ ను విక్రయించేందుకు అనురాధకు వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి తో పాటు గుంటూరు కు చెందిన శివ సాయి అనే వ్యక్తి సహకరించారు. గోవాకు నుండి తీసుకు వచ్చిన డ్రగ్స్ ను మోకిలా వద్ద ఓఓర్అర్ సమీపంలో ప్రభాకర్ రెడ్డికి, శివ సాయి కి అందిస్తున్న సమయంలో ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్స్ తో పాటు కార్లను సీజ్ చేశారు. గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసిన అనూరాధ నగరానికి తీసుకువచ్చి డిమాండ్ ను బట్టి గ్రాము 20వేల నుండి అధికంగా విక్రయించింది. ప్రభాకర్ రెడ్డి, శివ సాయి వీరు ఇద్దరు ముందు డ్రగ్ కన్జ్యూమర్లు ఉన్నారు. ఆనంతరం ఈజీ మనీ కోసం ఈ ముగ్గురు డ్రగ్ ఫెడ్లర్లుగా గా మారారు. ఈ ఇద్దరు వినియోగ దారులకు డ్రగ్స్ సరఫరా చేశారు.
నిందితుల మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు అందులో ఉండే డేటాను విశ్లేషిస్తున్నారు. ఆ డేటా ఆధారంగా వీరి నెట్వర్క్ తో పాటు వినియోగదారులు వివరాలు తెలుసుకో నున్నారు. నేడు ముగ్గుర్నీ రిమాండ్ కు తరలించిన అనంతరం ముగ్గుర్నీ కస్టడీలోకి తీసుకొనున్నారు పోలీసులు. కస్టడీ విచారణలో వీరి నెట్వర్క్ పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.