Hyderabad: ఓటరు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం.. మీ ఓటుందో లేదో చెక్ చేసుకోండి ఇలా..
రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటరు జాబితాలో ముందు గా మీ పేరు ఉందో లేదో ఈసీఐ వెబ్ సైట్ చేసుకొని సరి చూసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో పైన తెలిపిన ఈసీఐ, వెబ్ సైట్ గానీ ఓటరు హెల్ప్ లైన్ ద్వారా తిరిగి నమోదు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని పక్షంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని పౌరులు ఉపయోగించుకోవాలని కోరుతూ.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా లేదా ఫారం-6ని పూరించడానికి ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని రోనాల్డ్ రోస్ కోరారు.
ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కోసం అవసరమైన డాక్యుమెంటరీ రుజువులతో పాటు దరఖాస్తును సమర్పించాలి. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేయవచ్చు.
ఓటరు నమోదు, అభ్యంతరాలు..
రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటరు జాబితాలో ముందు గా మీ పేరు ఉందో లేదో ఈసీఐ వెబ్ సైట్ చేసుకొని సరి చూసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో పైన తెలిపిన ఈసీఐ, వెబ్ సైట్ గానీ ఓటరు హెల్ప్ లైన్ ద్వారా తిరిగి నమోదు చేసుకోవాలన్నారు.
ఫారం-6..
18 సంవత్సరాల వయస్సు దాటిన వారు, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండబోయేవారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలి.
ఫారం-6బి..
ఓటరు జాబితాలో ఆధార్ ను అనుసంధానం/ అప్ డేట్
ఫారం-7
ముసాయిదా ఓటరు జాబితా పేరు తొలగింపు, అభ్యంతరాలు
ఫారం-8 (సవరణలు)
- ముసాయిదా ఓటరు జాబితాలో పేరులో తప్పులు..
- ఇంటి నెంబర్ తప్పుగా ఉన్నప్పుడు.
- ప్రామాణికంగా లేని ఇంటి నెంబర్.
- అడ్రస్ మారినపుడు.
- ఓటరు జాబితాలో మిస్ మ్యాచ్ ఫోటోలు.
- సక్రమంగా లేని ఫోటోలు.
- కుటుంబ సభ్యుల రిలేషన్ తప్పుగా నమోదైన చో (తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు)
- ఒకే కుటుంబ సభ్యులు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్ లో ఉన్నట్లైతే..
- మీ కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు నియోజకవర్గంలో నమోదు అయినట్లైతే..
- మొబైల్ నెంబర్ అప్ డేట్
ఈ నెల 19 లోపు ఫారం-8 ద్వారా..
ఇంకా తదితర తప్పులు సవరించుకోవడానికి ఈ నెల 19 లోపు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకొనగలరు. ఓటరు జాబితాలో మీ ఓటరు సరి చూసుకొనుటకు, సవరణలు, కొత్త ఓటరు నమోదు, అభ్యంతరాల కొరకు మీ దగ్గరలో ఉన్న ఈఆర్ఓ, ఏ ఈ అర్ ఓ లు గా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్ లను సంప్రదించగలరు. లేదా ఈసీఐ వెబ్ సైట్ ద్వారా గాని ఓటరు హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి