Etela Rajender : మనల్నిపాలించే వారికి కూడా మెరిట్ ఉండాలి, ఆ బాధ ఏదోక నాడు నీ గడప కూడా తొక్కుతుంది : ఈటల
Etela Rajender : 'మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. అలాగే మనల్నిపాలించే వారికి కూడా మెరిట్ ఉండాలి' అన్నారు తెలంగణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రజల ఆకాంక్షల మేరకు మనం..
Etela Rajender : ‘మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. అలాగే మనల్నిపాలించే వారికి కూడా మెరిట్ ఉండాలి’ అన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి.. దేశ పౌరిడిగా, సగటు మనిషిగా స్పందించాలి అని ఆయన చెప్పారు. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సక్రమంగా అమలు కాలేదు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం అని ఈటల చెప్పుకొచ్చారు. ‘రాజ్యాంగాన్ని అర్దం చేసుకోగలగడమే ఆ మెరిట్.. సంపద కేంద్రీకరించడం పేదరికానికి కారణం.. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదు. ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దు..
ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుంది.’ అంటూ ఈటల హెచ్చరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు మాట్లాడత లేను, రైతుల కోసం మాట్లాడుతున్న’ అని రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు.