AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దుకాణాలపై దాడులు.. 8 మంది బీసీ నేతల అరెస్ట్‌.. ఆర్.కృష్ణయ్య ఆగ్రహం..

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ బంద్ కు అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే.. ఈ బంద్ అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది.. కానీ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Hyderabad: దుకాణాలపై దాడులు.. 8 మంది బీసీ నేతల అరెస్ట్‌.. ఆర్.కృష్ణయ్య ఆగ్రహం..
Bc Leaders Arrest
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2025 | 1:43 PM

Share

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ బంద్ కు అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే.. ఈ బంద్ అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది.. కానీ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 18 (శనివారం) నాడు జరిగిన దాడులపై పోలీసుల కేసు నమోదు చేసి.. ఎనిమిది మంది యువకులను అరెస్టు చేశారు. ఈ మేరకు కాచిగూడ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ సయ్యద్ అమీనుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను అరెస్టు చేశారు. బీసీ నాయకులు బుజ్జ కృష్ణ, నిఖిల్, రామకోటి, రాజ్ కుమార్, మోడీ, సాయిబాబా, రవితేజ, రామ్మూర్తిలపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది యువకులకు గాంధీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా.. దాడులకు పాల్పడిన వారిపై నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.

ఆర్.కృష్ణయ్య ఆగ్రహం..

కాగా.. యువకుల అరెస్ట్‌పై బీసీ సంఘాల ఆగ్రహం వ్యక్తంచేశాయి. దొంగలు, నక్సలైట్లను అరెస్ట్ చేసిన విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా..? అని బీసీ సంఘం నేత, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ యత్నిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదంటూ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..