ఈ నెల 8న ఆటోలు, క్యాబ్‌లు బంద్!
ఈ నెల 8వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్ కాబోతున్నాయి. ఈనెల 8 నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్స్ బంద్ పాటించనున్నట్లు ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎంవీ యాక్ట్ 2019ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8న ఆటో డ్రైవర్ల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆటో, వ్యాన్, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్‌ని విజయవంతం చేయాలని సంఘాల జేఏసీ నేతలు కోరారు. […]
ఈ నెల 8వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్ కాబోతున్నాయి. ఈనెల 8 నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్స్ బంద్ పాటించనున్నట్లు ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎంవీ యాక్ట్ 2019ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8న ఆటో డ్రైవర్ల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆటో, వ్యాన్, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్‌ని విజయవంతం చేయాలని సంఘాల జేఏసీ నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే.. తెలంగాణలోనూ ఆటో డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.