పబ్జీ ఎఫెక్ట్.. దొంగగా మారిన పూజారి.. ఒక్కడే ఏకంగా…

పబ్జీ.. ఇది ఎందరి జీవితాలను ఎన్నో రకాలుగా మార్చుతోంది. ఈ ఆటలో మునిగిపోయి.. ఎంతోమంది ప్రాణాలనే కోల్పోగా.. మరికొందరు వింత వింత ప్రవర్తనలు చేస్తూ.. మానసిక రోగులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే.. పబ్జీ గేమ్‌కు అడిక్ట్ అయ్యి.. దొంగగా మారాడు ఓ పూజారి. వివరాల్లోకి వెళితే… నగరానికి చెందిన మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉండే సిద్ధార్థ్ అనే 19 ఏళ్ల యువకుడు.. ఓ ఆయలంలో ఉదయం పూజలు చేసేవాడు. అయితే అతడు పబ్జీ గేమ్‌కు అలవాటు పడి… ఎప్పుడూ […]

పబ్జీ ఎఫెక్ట్.. దొంగగా మారిన పూజారి.. ఒక్కడే ఏకంగా...
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 5:14 AM

పబ్జీ.. ఇది ఎందరి జీవితాలను ఎన్నో రకాలుగా మార్చుతోంది. ఈ ఆటలో మునిగిపోయి.. ఎంతోమంది ప్రాణాలనే కోల్పోగా.. మరికొందరు వింత వింత ప్రవర్తనలు చేస్తూ.. మానసిక రోగులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే.. పబ్జీ గేమ్‌కు అడిక్ట్ అయ్యి.. దొంగగా మారాడు ఓ పూజారి. వివరాల్లోకి వెళితే… నగరానికి చెందిన మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉండే సిద్ధార్థ్ అనే 19 ఏళ్ల యువకుడు.. ఓ ఆయలంలో ఉదయం పూజలు చేసేవాడు. అయితే అతడు పబ్జీ గేమ్‌కు అలవాటు పడి… ఎప్పుడూ ఆ ఆటనే ఆడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రోజు తన తల్లిదండ్రులతో గొడవలు జరిగేవి. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. వేరే చోట ఉంటున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ సిద్ధార్థ్.. ఖరీదైన సైకిళ్లను టార్గెట్ చేసి చోరీలు చేశాడు. కుషాయిగూడ, నాచారం, నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చేశాడు. అలా దొంగతనం చేసిన సైకిళ్లను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.

అయితే కొద్ది రోజుల నుంచి మౌలాలి పరిసర ప్రాంతాల్లో సైకిళ్ల దొంగతనాల కేసులు ఎక్కువగా వస్తుండటంతో.. పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ సైకిళ్లను దొంగతనం చేస్తోంది.. పూజారి అవతారంలో ఉన్న సిద్ధార్థ్ అని నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి.. 31 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.