నమ్రత కాదు… నీరజ అట్లూరి! సృష్టి మాయాజాలం కేసులో ట్విస్ట్
అపురూపమైన, అమూల్యమైన మాతృత్వంతో చెలగాటమాడి, సంతాన సాఫల్యం ముసుగులో అక్రమ సంపాదన మరిగి కోట్లు వెనకేసుకున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఓనరమ్మ నమ్రత. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. కానీ.. ఆమె అసలు పేరు నమ్రత కాదట. మరేంటి? ఫుల్ డీటేల్స్ ఈ కథనంలో..

సృష్టి ఫెర్టిలిటీ మాయాజాలంలో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రత. అసలు పేరు నమ్రత కాదు అట్లూరి నీరజ. ఆమె మెడిసిన్ చేసింది విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్. కేసు దర్యాప్తులో భాగంగా ఇదే కాలేజ్‌లోని 1988 బ్యాచ్ మేట్స్‌పై ఆరోపణలొచ్చాయి. ఆ దిశగా ఆరా తీశారు పోలీసులు. రికార్డుల్ని పరిశీలిస్తే మరో ముగ్గురు డాక్టర్ల పేర్లు కనిపించాయి గాని, నమ్రత పేరు మాత్రం లేదు. మరింత లోతుగా పరిశీలిస్తే నమ్రత అసలు పేరు అట్లూరి నీరజగా తెలిసింది.
ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతుల్ని, సరొగసీకి ఒప్పించి, ఎవరికో పుట్టిన బిడ్డను అంటగట్టి లక్షలకు లక్షలు దండుకున్నారన్నది నమ్రత మీద నమోదైన అభియోగం. మొత్తం 80 మంది దంపతుల్ని ఈవిధంగా మోసగించినట్టు తనే స్వయంగా పోలీస్ కస్టడీలో ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు నమ్రత పేరుమార్పు వెనుక మతలబు ఏంటనేది మిస్టరీగా మారింది. ఫేక్ డాక్యుమెంట్లే కాదు, ఫేక్ నేమ్స్‌తో కూడా ఆమె మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
