AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మద్యం సేవిస్తూ వాంతులు చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆస్పత్రికి తీసుకెళ్లగా

ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వెళ్లాడు. ఫుల్‌గా మద్యం సేవించాడు. అంతటితో ఆగలేదు. తిరిగి రూమ్‌కి వచ్చిన తర్వాత కూడా మద్యపానం కొనసాగించాడు. బాడీ మాత్రం ఎంతని తీసుకుంటుంది చెప్పండి. దీంతో వాంతులు స్టార్ట్ అయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత....

Hyderabad: మద్యం సేవిస్తూ వాంతులు చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
Liquor Damage
Ram Naramaneni
|

Updated on: May 26, 2025 | 11:22 AM

Share

దేనికైనా ఓ లిమిట్ ఉండాలి.. హద్దులు లేకుండా ఏం చేసినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి.  తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే వెలుగుచూసింది. అధికంగా మద్యం సేవించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. హర్షవర్ధన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇద్దరు స్నేహితులతో ఆదివారం రాత్రి కొండాపూర్‌లోని క్వాక్ పబ్‌కు కలిసి వెళ్లాడు. అక్కడ ఫుల్‌గా మద్యం సేవించారు. అక్కడి నుంచి మళ్లీ తమ రూమ్‌కు వెళ్లారు. తర్వాత కూడా మద్యం తాగడం కొనసాగించారు. అయితే తెల్లవారుజామున అనూహ్యంగా హర్షవర్ధన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. అధికంగా మద్యం సేవించడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హర్షవర్ధన్ స్వస్థలం విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్ అని తెలిసింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హర్షవర్ధన్‌తో పాటు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు. వారంతాల్లో సాఫ్ట్ వేర్ వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. లిమిట్‌లో ఉంటే తప్పు లేదు.. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో.  బాడీ మాత్రం ఎంతని తీసుకుంటుంది చెప్పండి. అందుకే పార్టీలు చేసుకునేవాళ్లు కాస్త హద్దుల్లో ఉంటే మంచిది. అతి ఎప్పుడూ ప్రమాదకరమే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు