Hyderabad: వైజాగ్ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.! నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాచకొండ కమిషనర్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుపడుతున్నాయి. రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో..

Hyderabad: వైజాగ్ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.! నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
Drugs
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2024 | 4:17 PM

నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాచకొండ కమిషనర్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుపడుతున్నాయి. రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో హయత్ నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఆష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా పట్టుబడింది. ఇటీవల కాలంలో తండ్రికొడుకుల పెద్ద మొత్తంలో గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు. తాజాగా ఈ కేసులో ఇద్దరు కజిన్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. కొండబాబు, బాలకృష్ణ అని ఇద్దరు వ్యక్తులు అల్లూరి జిల్లాకు చెందినవారు. వీరు వ్యవసాయం చేస్తూ ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాల సరఫరాను ఎంచుకున్నారు. కొండబాబు, బాలకృష్ణ ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడలర్స్ అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

ఈ కేసులో మొత్తం రూ. కోటి విలువ చేసే 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆష్ ఆయిల్‌ను ఒడిస్సాలో కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తున్నారు. అన్నవరం సమీపంలో ఓ పశువుల మార్కెట్‌లో కొండబాబుకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ద్వారా కొండబాబు, బాలకృష్ణ మాదకద్రవ్యాల సరఫరాలోకి దిగారు. ఈ నిందితులు ఇద్దరు కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి బెంగళూరులో అమ్మి 10 రెట్లు అధిక లాభాన్ని పొందుతున్నారు.

ఇటీవల బెంగళూరుకు చెందిన రిసీవర్ 14 కేజీల హాష్ ఆయిల్‌ను ఆర్డర్ ఇచ్చాడు. కొండబాబు, బాలకృష్ణ హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి బెంగళూరు చేరవేయడానికి ప్రయత్నించారు. పక్కా సమాచారంతో నిందితులపై నిఘా పెట్టి పెద్ద అంబర్‌పేట్ దగ్గర అదుపులో తీసుకున్నారు పోలీసులు. గతంలో బాలకృష్ణపై ఎన్డీపీఎస్ కేసులు కూడా ఉన్నాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌లో గంజాయి సప్లయర్స్‌తో ఈ నిందితులిద్దరికీ సంబంధాలు ఉన్నాయని రాచకొండ సీపీ తెలిపారు. రూ. కోటి విలువ చేసే ఈ ఆష్ ఆయిల్ బహిరంగ మార్కెట్‌లో రూ. 14 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీరికి ఇంకా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయనే దానిపై విచారణ చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..