సెక్రటేరియట్ వద్ద కుంగిన రోడ్డు.. పైప్‌లైన్ లీకేజీనే కారణమా..!

నగరంలో ప్రశాంతంగా నిమజ్జనం ముగిసిన వేళ.. సెక్రటేరియట్ సమీపంలో కొద్దిగా కుంగిన రోడ్డు అధికారులను ఉరుకులు పెట్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్తున్న దారిలో పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు కొద్దిగా కుంగింది. దీంతో అధికారులు దాని చుట్టూ బారికేడ్లు పెట్టారు. దీని వలన ఎలాంటి తప్పిదాలు జరగలేదు. అయితే సాయంత్రానికి అది కాస్త ఇంతింతై నాలుగడుగుల గుంతగా మారింది. దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో జోనల్ కమిషనర్ ముషారఫ్, ఈడీ విజయ్ కుమార్‌లు […]

సెక్రటేరియట్ వద్ద కుంగిన రోడ్డు.. పైప్‌లైన్ లీకేజీనే కారణమా..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:20 PM

నగరంలో ప్రశాంతంగా నిమజ్జనం ముగిసిన వేళ.. సెక్రటేరియట్ సమీపంలో కొద్దిగా కుంగిన రోడ్డు అధికారులను ఉరుకులు పెట్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్తున్న దారిలో పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు కొద్దిగా కుంగింది. దీంతో అధికారులు దాని చుట్టూ బారికేడ్లు పెట్టారు. దీని వలన ఎలాంటి తప్పిదాలు జరగలేదు. అయితే సాయంత్రానికి అది కాస్త ఇంతింతై నాలుగడుగుల గుంతగా మారింది. దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో జోనల్ కమిషనర్ ముషారఫ్, ఈడీ విజయ్ కుమార్‌లు పరిశీలించి మరమ్మత్తులకు ఆదేశించారు. అయితే మూడు అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పగిలి నీరు వెలుపలికి రావడంతోనే అక్కడ రోడ్డు కుంగినట్లు అధికారులు గుర్తించారు. గుంతను మూసివేసే పనులు వేగవంతం చేసినట్లు అధికారులు చెప్పారు. అయితే గతంలోనూ 2016లో అదే ప్రాంతంలోనే రోడ్డు కాస్త కుంగింది. అప్పుడూ పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు. ఇదిలా ఉంటే అదే సంవత్సరంలో నవంబర్‌లో అజమ్‌పుర, కూకట్‌పల్లిలో రోడ్డు కుంగిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.