AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: గల్లీకి చేరిన ఢిల్లీ రాజకీయాలు.. వరి ధాన్యం కోనుగోలుపై ఆగని మాటల యుద్ధం..

గత 9 రోజులుగా ఢిల్లీలో పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేసిన TRS.. సమావేశాలను బాయ్‌ కాట్‌ చేసి జనాల్లో తేల్చుకుంటామని ప్రకటించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు...

Telangana News: గల్లీకి చేరిన ఢిల్లీ రాజకీయాలు.. వరి ధాన్యం కోనుగోలుపై ఆగని మాటల యుద్ధం..
Politics
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 07, 2021 | 9:16 PM

Share

గత 9 రోజులుగా ఢిల్లీలో పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేసిన TRS.. సమావేశాలను బాయ్‌ కాట్‌ చేసి జనాల్లో తేల్చుకుంటామని ప్రకటించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము పోరాటం చేస్తుంటే కేంద్రం సమాధానం దాట వేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి ఢిల్లీకి పంపితే బీజేపీ ఎంపీలు కనీసం రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదంటున్నారు. ప్రజాక్షేత్రంలో BJP నిజస్వరూపం బయటపెడతామని చెబుతున్నారు.

రాష్ట్రాలతో జరిగిన ఒప్పందాల ప్రకారమే వరి సేకరణ ఉంటుందని.. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌ కోపంలో లేని వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. పార్లమెంటులో TRS ఎంపీల కిసాన్‌ బచావో నినాదం కూడా కేసీఆర్‌ బచావో అంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అటు BJP ఇటు TRS విమర్శలు, ప్రతివిమర్శలతో దూకుడుగా ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి తోడు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి.

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ సారధ్యంలోని విపక్షాల ఆందోళనకు TRS మద్దతిచ్చింది. కాంగ్రెస్, TRS కలిసి నిరసనలో పాల్గొన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని BJP ప్రచారం మొదలుపెట్టింది. ఇది తెలంగాణలోని కాంగ్రెస్ నేతలను ఇరుకునపెడుతోంది. దీంతో రంగంలో దిగిన పీసీసీ నేతలు బీజేపీ-TRS ఒక్కటే అంటూ కౌంటర్‌ ఎటాక్‌ మొదలుపెట్టారు. బీజేపీ డ్రామాలో TRS‌ పాత్రధారి అంటోంది కాంగ్రెస్‌. పార్లమెంటులో చర్చలు జరగకుండా TRSను బీజేపీ ప్రయోగించిందని.. MLC ఎన్నికలు ఉన్నాయని మళ్లీ హైదరాబాద్‌కు MPలను కేసీఆర్‌ రప్పించారని ఆరోపిస్తోంది.

ఎవరికి వారు తెలంగాణలో రాజకీయ అధిపత్యం కోసం మైండ్‌గేమ్‌ ఆడుతున్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటిదాకా హస్తినలో ఫైటింగ్‌ చేసిన నేతలు ఇప్పుడు గల్లీ బాటపడుతున్నారు. ఇంతకీ తెలంగాణలో ఎవరు ఎవరితో జత కడుతున్నారు.. ఎవరు ఆదేశిస్తే మరెవరు పాటిస్తున్నారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు TRS – BJPల మధ్య రహస్య బంధం ఉందా? బీజేపీ ప్రచారం చేసినట్టు TRS- కాంగ్రెస్‌ పొత్తులకు సిద్దమవుతున్నాయా? అనేది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న..

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Read Also.. Cement Price: దక్షిణాది రాష్ట్రాలో తగ్గిన సిమెంట్ ధర.. ఎక్కడ ఎంత తగ్గిందంటే..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం