Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cement Price: దక్షిణాది రాష్ట్రాలో తగ్గిన సిమెంట్ ధర.. ఎక్కడ ఎంత తగ్గిందంటే..

మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అయితే మీకిది శుభవార్తే.. ఎందుకంటే సిమెంట్ ధరలు తగ్గాయి. బస్తాకు రూ.40 తగ్గింది. సిమెంట్ ధర తగ్గడానికి గిరాకీ పడిపోవడమే కారణమని తెలుస్తుంది...

Cement Price: దక్షిణాది రాష్ట్రాలో తగ్గిన సిమెంట్ ధర.. ఎక్కడ ఎంత తగ్గిందంటే..
Cement
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 07, 2021 | 3:18 PM

మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అయితే మీకిది శుభవార్తే.. ఎందుకంటే సిమెంట్ ధరలు తగ్గాయి. బస్తాకు రూ.40 తగ్గింది. సిమెంట్ ధర తగ్గడానికి గిరాకీ పడిపోవడమే కారణమని తెలుస్తుంది. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు చెప్పారు. ఏపీ, తెలంగాణలో బస్తాకు రూ.40 వరకు తగ్గినట్లు చెబుతున్నారు. తమిళనాడులో రూ.20 వరకు తగ్గిందని ‘ఇన్ఫామిస్ట్‌’కు డీలర్లు వెల్లడించారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు ధర తగ్గింది. ధరల తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల్లో బస్తా రేటు రూ.280-320కి చేరనుంది. తమిళనాడులో బ్రాండ్‌ సిమెంట్ ధర రూ.400 కంటే తక్కువకు, కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు తెలిపారు.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, చెట్టినాడ్‌ సిమెంట్‌, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా ధరలు తగ్గించాయి. నవంబరు చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో ధరలను పెంచాలని సిమెంటు కంపెనీలు అనుకున్నాయి. కానీ గిరాకీ తగ్గడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవటమే ధరలు తగ్గించాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలకు తోడు, ద్రవ్యలభ్యత సమస్యలతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో నవంబరు చివరి వారం నుంచి డిసెంబరు తొలి వారం వరకు భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు అధిక స్థాయిలో ఉండడంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది. బిల్డర్ల వద్ద డబ్బులు లేక సిమెంటు వినియోగం కూడా తగ్గినట్లు సమాచారం.

Read Also.. ATM Transcations: ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఏటీఎం ఛార్జీలపై మరింత బాదుడు..