AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases In Schools: స్కూల్స్ మూసివేస్తారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి.!

విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా...

Corona Cases In Schools: స్కూల్స్ మూసివేస్తారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి.!
Sabita Indrareddy
Ravi Kiran
|

Updated on: Dec 07, 2021 | 6:23 PM

Share

ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలతో స్కూళ్లు మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఖండించారు. పుకార్లను నమ్మవద్దన ఆమె.. పాఠశాలల్లో పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రెజంట్ సిచ్యూవేషన్ అండర్ కంట్రోల్ అన్న సబిత ఇంద్రారెడ్డి.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పాఠశాల సిబ్బంది, పిల్లల పేరెంట్స్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసులు ఓ వైపు.. తరుముకొస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మరోవైపు.. వెరసి ఈ మధ్యనే తెరుచున్న పాఠశాలలను మూసివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను బడికి పంపాలా వద్దా అన్న డైలామా ఉన్నారు. వీటన్నింటికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రిసబితా ఇంద్రారెడ్డి స్కూళ్లపై క్లారిటీ ఇచ్చారు. బడులు మూసివేస్తారన్న పుకార్లు నమ్మవద్దని తేల్చిచెప్పారు. విద్యాలయాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పేరెంట్స్ కి మంత్రి భరోసా ఇచ్చారు. స్పాట్

రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. స్కూల్స్ లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని… కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.. వందశాతం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సబిత సూచించారు. సోషల్ మీడియాలో పాఠశాలల మూసివేత అంటూ వస్తున్న రూమర్స్ పై మండిపడ్డారు. ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు నష్టపోయారని.. పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అక్కడక్కడ స్కూళ్సు, గురుకుల పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు వాస్తవమేనని.. అయితే ఆందోలన చెందే పరిస్థితి లేదని భరోసా ఇచ్చారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి.. రెండేళ్ల ప్రత్యక్ష విద్యాభ్యాసం కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి… రైట్ టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.

(విద్యాసాగర్, టీవీ9 రిపోర్టర్)