Hyderabad: ఈ వేరియంట్ బారిన పడ్డ వారికి ఐపీసీ సెక్షన్స్‌తో చికిత్స.. వైరల్‌గా మారిన ట్రాఫిక్ పోలీసుల ట్వీట్..
Hyderabad Traffic police: ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అని పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పినా కొందరు ప్రబుద్ధులు మాత్రం అస్సలు పట్టించుకోరు. నిబంధనల ఉల్లంఘన వల్ల కేవలం తాము...
Hyderabad Traffic police: ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అని పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పినా కొందరు ప్రబుద్ధులు మాత్రం అస్సలు పట్టించుకోరు. నిబంధనల ఉల్లంఘన వల్ల కేవలం తాము తప్పు చేయడమే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదం పెడుతుంటారు. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతోన్న ప్రమాదాలు చూస్తుంటే బయటకు వెళ్లిన వాళ్లం మళ్లీ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తామా.? అన్న అనుమానాలు వచ్చేలా చేస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు.
ఇక మరికొందరు యధేశ్చగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. హెల్మెట్ ధరించక పోవడం, వేగంగా వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం లాంటి వాటితో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇందుకోసమే ట్రాఫిక్ పోలీసులు కెమెరాను అస్త్రంగా మార్చుకొని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి చలాన్ల అస్త్రాన్ని సంధిస్తున్నారు. అయితే దీనిని కూడా తప్పించుకోవడానికి కొందరు ప్రబుద్ధులు ఇటీవల నెంబర్ ప్లేట్లను కనిపించకుండా చేస్తున్నారు. నోటికి ధరించాల్సిన మాస్కులను నెంబర్ ప్లేట్లకు అడ్డుగా పెట్టి.. రయ్యి రయ్యి మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. దీంతో చలాన్లు వేద్దామన్నా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఓ దృశ్యమే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు దొరికింది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు.. ‘ఈ కొత్త వేరియంట్ బారిన పడిన రోగులకు ఐపీసీ సెక్షన్ కింద ప్రత్యేకంగా చికిత్స ఇస్తాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఫోటోకు మీ క్యాప్షన్ ఏంటని ఓ యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
These new variant patients will be treated with proper IPC sections.#CaptionPlease pic.twitter.com/buKGT6GdcK
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) December 7, 2021
PM Modi Tour: ప్రధాని మోడీ 2022 విదేశీ ప్రయాణ క్యాలెండర్ ప్రారంభం అక్కడినుంచే.. ఎందుకోసమో తెలుసా..?
Akhanda: బాలీవుడ్‌కు బాలయ్య బ్లాక్ బస్టర్ “అఖండ”.. హీరో ఎవరో తెలుసా..!!