AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పట్టుబడుతూనే ఉంటారు.. పుచ్చుకుంటూనే ఉంటారు.. లంచావతారాల పరిసమాప్తి ఇంకెప్పుడు!

కాలం గిర్రున తిరుగుతోంది. ప్రపంచం మారిపోతోంది. ఎన్నో మార్పులొస్తున్నాయ్. ఒక్కటి తప్ప. గులాబీ రంగు సీసాలు, ఆ సీసాల కింద పేకముక్కల్లా పరిచిన నోట్లు, వాటి వెనక చేతులు కట్టుకుని నిల్చునే అధికారి. ఈ సీన్ మాత్రం మారట్లేదు. 'లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి' అనే హెడ్‌లైన్ వస్తే సిగ్గుతో చచ్చిపోవాలి. బట్.. ఆ వార్త లంచావతారులకో బిరుదు. అవినీతి మరక అంటకపోతేనే.. 'ఛీ.. జీవితం' అని సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఓ లెక్క చెబుతా వినండి. ఏపీలో 295 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయ్. అందులో ఉండాల్సిన సిబ్బంది 2వేల 829 మంది. ఉన్నది 860. ఈ 860 మందిలో దాదాపు అందరిపైనా ఏసీబీ కేసులున్నాయ్. ఆదాయానికి మించి ఆస్తులున్నాయ్. ఇప్పుడు చెప్పండి.. అవినీతి మరక లేకపోతేనే సిగ్గుతో చచ్చిపోతాడా లేదా. అసలు రిజిస్ట్రేషన్ శాఖను అవినీతికి కేరాఫ్‌గా మార్చిందెవరు? పుచ్చుకునే వాళ్లా, ఇచ్చినవాళ్లా? అసలు.. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులలో లంచం ఎలా చేతులు మారతాయ్? ఎవరెవరు పుచ్చుకుంటారు?

Telangana: పట్టుబడుతూనే ఉంటారు..  పుచ్చుకుంటూనే ఉంటారు.. లంచావతారాల పరిసమాప్తి ఇంకెప్పుడు!
Sub Registrar Corruption
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2025 | 9:57 PM

Share

లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి.. కొన్నాళ్ల తరువాత ప్రమోషన్ కూడా వస్తుంది. అదెలా సాధ్యం? పట్టుబడిన అధికారులు వారంలోనే బెయిల్‌పై బయటికొస్తారు. బట్.. వాళ్లపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రెండుమూడేళ్లు పట్టొచ్చు. రెండేళ్ల తర్వాత కూడా కేసు విచారణ పూర్తి కాకపోతే.. పట్టుబడిన ఉద్యోగిని తాత్కాలికంగా తిరిగి అదే పోస్ట్‌లోకి తీసుకుని వేరే ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అప్పటికే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్లకు గిఫ్ట్‌లు వెళ్తాయ్. ఇవన్నీ సక్రమంగా జరిగితే మూడేళ్లకే నిర్దోషిగా బయటపడి ప్రమోషన్ దక్కించుకుంటాడు. సో, లంచం తీసుకుంటుండగా పట్టుకోవటం, రికార్డు చేయటం, కేసు పెట్టడం.. పైకి కనిపించేది ఇంత వరకే. దొరకడానికి, ప్రమోషన్‌కు మధ్య పెద్ద చరిత్రే జరుగుతుంది. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులలో అంతా డిజిటల్ పేమెంట్సే ఇప్పుడు. ఎక్కడా నోట్ల కట్టలు తీయక్కర్లేదు. అలా ప్లాన్ చేశారు. కాని, ఏసీబీ అధికారులు సడెన్ రెయిడ్స్ వెళ్లినప్పుడు మాత్రం నోట్ల కట్టలు కిటికీల నుంచి దూకి బయటికొచ్చాయి. నోటు కనపడడమే తప్పు అంటుంటే.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులలో కట్టలకు కట్టలు దొరుకుతున్నాయి. ఏ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకైనా వెళ్లండి. పక్కనే డాక్యుమెంట్ రైటర్ పేరుతో షాపులు ఉంటాయి. అవినీతి పురుడుపోసుకునేది అక్కడే. నేరుగా డబ్బులు తీసుకోవడం గట్రా ఎక్కడా కనిపించదు ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప. అంతా.. డాక్యుమెంట్ రైటర్ల దగ్గరకే అమ్యామ్యా ముచ్చట్లు, వాటాలు తేలిపోతాయి. అసలీ డాక్యుమెంటర్ రైటర్లను వసూల్ రాజాలు అనాలో, బ్రోకర్లు అనాలో తెలీదు. కొన్నిసార్లు అంతకు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి