Python Video: అయ్య బాబోయ్.. ఇదేందిరా స్వామి ఇంత ఉంది.. ఎక్కడో తెలుసా..?
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన చోటుచేసుకుంది. వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రహదారి మధ్యలో భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. రాత్రి 9 గంటల సమయంలో కారులో వెళ్తున్న భక్తులు ఆ పామును చూసి ఆశ్చర్యంతో ఫోన్‌లలో వీడియో తీశారు.

తిరుమల మార్గంలో భక్తులకు హఠాత్తుగా భయాందోళన కలిగించిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భక్తుల ప్రియమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఒక భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. రాత్రి 9 గంటల సమయంలో వినాయక స్వామి ఆలయం దాటిన వెంటనే రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కారులో వెళ్తున్న కొందరు భక్తులు ఆ దృశ్యాన్ని చూసి వాహనాలను ఆపి దూరం నుంచే మొబైల్ ఫోన్‌లలో వీడియో తీశారు. కొన్ని క్షణాల పాటు ఆ కొండ చిలువ రహదారిపైనే ఉండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం అది నెమ్మదిగా పక్కనే ఉన్న అడవిలోకి జారుకుంది.
భక్తులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సుమారు 10 అడుగుల పొడవున్న పామును రోడ్డు మీద సులభంగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. “ఇంత పెద్ద కొండ చిలువను దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి” అని పలువురు భక్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కొండ ప్రాంతాల గుండా వెళ్తున్న రహదారుల్లో ఇలాంటి జంతువులు తరచూ దర్శనమిస్తుంటాయని, భక్తులు భయపడవలసిన అవసరం లేదని వారు తెలిపారు. రాత్రివేళల్లో వాహనాలు నెమ్మదిగా నడపాలని, వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటిని దగ్గరగా వెళ్లి చిత్రీకరించడం లేదా ఆటంకం కలిగించడం మానుకోవాలని సూచించారు.
వీడియో దిగువన చూడండి….
