Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబరు 3వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. నగరంలో నిత్యం వేలాదిమంది మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యతో సమయానికి ఆఫీసులకు చేరుకోడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ఎక్కువమంది మెట్రో ప్రయాణానికే ప్రాముఖ్యతనిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన
Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్ నిఘా
విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

