Preethi Health Condition: ప్రీతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. నిమ్స్ వద్ద భద్రతను పెంచిన పోలీసులు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా మారింది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా మారింది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. కాసేపట్లో ఆమె హెల్త్ బులిటెన్ ద్వారా అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు. దీంతో నిమ్స్ ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. ఇక ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్కశాతం మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి పేర్కొంటున్నారు.
వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. అయితే ఆత్మహత్యకు యత్నించే ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసింది. ప్రీతి తన బాధను పంచుకుంది. ఈ ఫోన్ కాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన తెలుస్తోంది. మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి