Warangal: ‘ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.. నిందితులను వదిలిపెట్టేదే లేదు’.. మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్..
ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం నాడు పాలకుర్తిలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం నాడు పాలకుర్తిలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. మీడియాతో మాట్లాడారు. బతుకుతుందని ఒక్క శాతమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ‘నా బిడ్డ పేరు కూడా ప్రీతే.. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నా. మృత్యువుతో పోరాడుతున్న ప్రీతిని చూస్తే బాధేస్తుంది. వారి కుటుంబానికి నేను పూర్తి అండగా ఉంటా. ప్రీతిని వేధించినవారిని వదిలిపెట్టం’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
ఇదిలాఉంటే.. పాలకుర్తి పర్యటనలో భాగంగా.. సేవాలాల్ ఆలయానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి భూమి పూజ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణలో మొట్టమొదటి సేవాలాల్ ఆలయాన్ని పాలకుర్తిలో నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పాలకుర్తిలో ఈ సందర్భంగా రాజీవ్ చౌరస్తా నుంచి లంబాడీల సాంప్రదాయ వస్త్రాదరణంతో భారీ ర్యాలీ తీశారు. లంబాడీలతో కలిసి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత డాన్స్ చేశారు.
పాలకుర్తిని గొప్ప అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతన్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దీని కోసం రూ.100 కేటాయించినట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..