AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekend Hour: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పంచాయితీ..! CWCలో చోటు కోసం కోల్డ్‌వార్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అయితే ఆ పోరాటం ప్రజాసమస్యలో, లేక ప్రభుత్వ విధానాలపైనో కాదు. పార్టీ పదవుల కోసం. CWC రూపంలో రాజుకున్న చిచ్చు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Weekend Hour: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పంచాయితీ..! CWCలో చోటు కోసం కోల్డ్‌వార్..
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2023 | 12:21 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అయితే ఆ పోరాటం ప్రజాసమస్యలో, లేక ప్రభుత్వ విధానాలపైనో కాదు. పార్టీ పదవుల కోసం. CWC రూపంలో రాజుకున్న చిచ్చు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణయాధికారం సీడబ్యూసీదే.! అందుకే ఆ కమిటీలో చోటు కోసం కాంపిటీషన్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. చివరిసారిగా 1997లో CWCకి ఎన్నికలు నిర్వహించారు. ఈసారి ఎలక్షన్లు ఉంటాయని అంతా భావించారు. కానీ నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడికే అప్పగిస్తూ రాయ్‌పూర్‌ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీకి కారణమైంది.

ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ప్లీనరీలో తీర్మానించారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం పార్టీ పదవుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. చోటు ఆశిస్తున్న వారి లిస్ట్‌ పెద్దగానే ఉంది. ఇప్పటికే లాబీయింగ్ కూడా మొదలైంది.

అసలు కోమటిరెడ్డి వెంకట్‌కరెడ్డి ఎవరో నాకు తెలీయదంటూ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌అలీ చేసిన కామెంట్స్.. పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తికి అద్దంపడుతున్నాయి.

ఒకరా.. ఇద్దారా..! CWC రేసులో ఉన్న తెలంగాణ నేతల లిస్ట్ పెద్దగానే ఉంది.. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ ఇలా చాలా మందే ఆశలు పెట్టుకున్నారు.

ఇంతకీ హైకమాండ్ ఆలోచన ఏంటి? తెలంగాణ నుంచి CWCలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? దక్కిని వాళ్లు సైలెంట్‌గా ఉంటారా? రచ్చ రాజేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

వీకెండ్ అవర్ విత్ మురళీ కృష్ణ.. లైవ్ వీడియోను ఈ కింద వీక్షించండి..