Hyderabad Drugs Case: హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు.. మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు..

హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు(Hyderabad drugs case) కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు కిరణ్‌ రాజ్‌ను పబ్‌ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో..

Hyderabad Drugs Case: హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు.. మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు..
Hyderabad Drugs Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2022 | 3:11 PM

హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు(Hyderabad drugs case) కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు కిరణ్‌ రాజ్‌ను పబ్‌ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో A1 అనిల్, A2 అభిషేక్, A3 అర్జున్, A4 కిరణ్ రాజ్‌ని చేర్చారు. ప్రస్తుతానికి అనిల్, అభిషేక్.. చంచల్ గూడ జైలులో ఉన్నారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మందు తాగే కొద్దీ కిక్ వస్తదో లేదో గానీ.. పుడింగ్ అండ్ మింక్ పబ్‌ కేసులో తవ్వే కొద్దీ మత్తెక్కించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పబ్‌లో డ్రగ్స్ అమ్మడమే కాదు.. మైనర్లకూ మద్యం పోస్తున్నారు.. శనివారం రాత్రి పోలీసుల రెయిడ్‌లో దొరికిన వాళ్లలో ఆరుగురు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున జూనియర్ ఆర్టిస్ట్ కుషిత వయసు కూడా 20 సంవత్సరాల లోపే ఉంది. రూల్ ప్రకారం 21 సంవత్సరాలు నిండిన వారినే పబ్‌లోకి అనుమతించాలి. మద్యం సప్లై చేయాలన్నా 21 ఏళ్లు ఉండాలి. కానీ కుషిత ఆధార్ కార్డ్ ప్రకారం ఆమె వయసు 21 దాటలేదు. అలాంటప్పుడు ఆమెను లోపలికి ఎలా అనుమతించారు?

విన్నారుగా.. తాను ఏ తప్పు చేయలేదని కుషిత చెప్తున్నారు. మరి ఇది తప్పు కాదా.. 21 ఏళ్లు నిండకుండా పబ్‌లోకి వెళ్లడం తప్పు కాదా? ఇక్కడ మనకు కనిపిస్తున్నది కుషిత ఆధార్ కార్డ్.. అందులో ఆమె డేట్ ఆప్ బర్త్ ఇయర్ 2002. అంటే 20 కూడా నిండలేదు. కానీ పబ్‌కి వెళ్లి.. లేట్ నైట్ పార్టీలో పోలీసులకు దొరికిపోయింది. పైగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. వీడియో కూడా విడుదల చేయడంతో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ డ్రగ్స్ కేసు ఎఫ్‌ఐఆర్‌లోనూ ఇంట్రస్టింగ్ పాయింట్లు ఉన్నాయి. ముందు ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు ఆ తర్వాత నాలుగో నిందితుడిని కూడా చేర్చారు. అనిల్, అభిషేక్, అర్జున్‌తో పాటు కిరణ్ రాజ్‌ కూడా ఇప్పుడు నిందితుడే. ఈ పబ్‌కి లీగలైజర్‌గా కిరణ్ రాజ్‌ వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో లిస్ట్ అయింది. పోలీసులు రెయిడ్‌ చేసిన టైమ్‌లో పబ్‌లో రాజకీయ ప్రముఖులు, సెలెబ్రిటీల పిల్లలు ఉన్నారు. దీంతో తమ పిల్లలకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

మరోవైపు హైదరాబాద్‌‌లో డ్రగ్స్ కారణంగా చనిపోయిన బీటెక్ విద్యార్ధి కేసులో మోస్ట్ వాంటెడ్ లక్ష్మీపతి కోసం.. పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే లక్ష్మీపతి. బీటెక్‌ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే లక్ష్మీపతి గంజాయికి అలవాటు పడ్డాడు. ఏడేళ్లుగా గంజాయికి బానిసైనట్టు పోలీసుల విచారణలో తేలింది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గంజాయి, డ్రగ్స్ విక్రయం అలవాటు చేసుకున్నాడు. ప్రేమ్‌కుమార్‌‌తో లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గోవా నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ సప్లై చేస్తూ భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడీ లక్ష్మీపతి.

ఇవి కూడా చదవండి: Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..