AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karvy MD Arrest: కార్వీ ఎండీ పార్థసారధిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… సుమారు రూ. 700 కోట్లకుపైగా రుణాలు ఎగవేశారంటూ..

Karvy MD Arrest: హైదరాబాద్‌ కేంద్రంగా మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. దీని విలు ఏకంగా రూ. 780 కోట్లు ఉంటుందని అంచనా. బ్యాంకు రుణాలను ఎగరవేశారనే ఆరోపణలతో...

Karvy MD Arrest: కార్వీ ఎండీ పార్థసారధిని అరెస్ట్‌ చేసిన పోలీసులు... సుమారు రూ. 700 కోట్లకుపైగా రుణాలు ఎగవేశారంటూ..
Karvy Md Arrest
Narender Vaitla
|

Updated on: Aug 19, 2021 | 3:17 PM

Share

Karvy MD Arrest: హైదరాబాద్‌ కేంద్రంగా మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. దీని విలు ఏకంగా రూ. 780 కోట్లు ఉంటుందని అంచనా. బ్యాంకు రుణాలను ఎగరవేశారనే ఆరోపణలతో కార్వీ ఎండీ పార్థసారధిని సీసీఎస్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి పలు బ్యాంకుల్లో రూ. వందల కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ఈ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పార్థసారధిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారని బ్యాంకులు తెలిపాయి. అంతేకాకుండా పార్థసారధి సుమారు రూ. 720 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వీటి నేపథ్యంలో పార్ధసారధిని గురువారం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. పార్ధసారధిని మరికాసేపట్లో చంచలగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే స్టాక్‌ బ్రోకింగ్ సంస్థ అయిన కార్వీపై గతంలోనే సెబీ నిషేధం విధించింది. సెబీ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. కార్వీ తమ సంస్థలోని ఖాతాదారుల సెక్యూరిటీని దుర్వినియోగం చేసిందని తేలడంతో కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా 2019లో సెబీ ఆంక్షలు విధించింది. కార్వీ తన ఖాతాదారులకు చెందిన రూ. 2800 కోట్లను దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకున్నట్లు అప్పట్లో తేలింది. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Gandhi Hospital: వీడుతోన్న గాంధీ ఆసుపత్రి అత్యాచార మిస్టరీ.. బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యం.

కాబూల్ లోని గురుద్వారాలో సిక్కులు, హిందువులకు అభయమిచ్చిన తాలిబన్లు..అకాలీదళ్ నేత వెల్లడి…