AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Hospital: వీడుతోన్న గాంధీ ఆసుపత్రి అత్యాచార మిస్టరీ.. బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యం.

Gandhi Hospital: హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి అచ్చారా ఘటన మిస్టరీ విడుతోంది. రోజుకే మలుపు తిరిగిన ఈ కేసులో తాజాగా పురోగతి లభించింది. కిడ్నీ చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన...

Gandhi Hospital: వీడుతోన్న గాంధీ ఆసుపత్రి అత్యాచార మిస్టరీ.. బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యం.
Gandhi Hospital Rape Case
Narender Vaitla
|

Updated on: Aug 19, 2021 | 2:39 PM

Share

Gandhi Hospital: హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి అచ్చారా ఘటన మిస్టరీ విడుతోంది. రోజుకే మలుపు తిరిగిన ఈ కేసులో తాజాగా పురోగతి లభించింది. కిడ్నీ చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను ఈ నెల 5న గాంధీకి తీసుకొచ్చిన సందర్భంలో సదరు మహిళ వెంట ఆమె చెల్లెలు కూడా వచ్చింది. ఈ సందర్భంలోనే గాంధీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ గార్డు విజయ్‌తో పాటు మరికొందరు కలిసి అత్యాచారినికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై చిలకలగూడ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మహిళ సోదరి కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసుపై పోలీసులు తీవ్రంగా దృష్టిసారించారు. విచారణలో భాగంగా తాజాగా పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

అత్యాచార ఘటనల ఆరోపణ తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. ఘటన జరిగిన రోజు బాధితురాలు విజయ్‌తో కలిసి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే బాధితురాలు ఇష్టపూర్వకంగానే వెళ్లిందా.? లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ తాజాగా లభ్యమైంది. నారాయణగూడ పోలీసులు బాధితురాలి సోదరిని హిమాయత్‌నగర్‌లో గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. విచారణ అనంతరం పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Also Read: Pulagam Recipe: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. కొత్తబియ్యంతో పులగం తయారీ విధానం..

ఆఫ్ఘనిస్తాన్‏లో మారిన మహిళల దుస్తుల అలంకరణ.. ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతున్న రిపోర్టర్ ఫోటోలు.. Raksha Bandhan 2021: మీ సోదరుడిని ఈ తీయని బంధంతో ముడేయండి.. ఈ స్వీట్లను ఇంట్లో ప్రయత్నించండి.. వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి