AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు రకరకాల మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. మొన్నటి వరకు హ్యాష్‌ ఆయిల్‌, చాక్లెట్లుగా మార్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేటుగాళ్లు మరో కొత్త ఎత్తు వేశారు. ఈసారి గంజాయిని ఏకంగా పొడిగా చేసి విక్రయిస్తున్నారు. తాజాగా టీఎస్‌ న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ...

Hyderabad: మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
Representative Image
Narender Vaitla
|

Updated on: Apr 18, 2024 | 7:38 AM

Share

పోలీసులు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా, ఎంత పటిష్ట భద్రతలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. యథేశ్చగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలోకి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. పోలీసుల కళ్లు కప్పి నగరంలోకి గంజాయి తీసుకొస్తున్నారు.

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు రకరకాల మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. మొన్నటి వరకు హ్యాష్‌ ఆయిల్‌, చాక్లెట్లుగా మార్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేటుగాళ్లు మరో కొత్త ఎత్తు వేశారు. ఈసారి గంజాయిని ఏకంగా పొడిగా చేసి విక్రయిస్తున్నారు. తాజాగా టీఎస్‌ న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక విభాగాలు గంజాయి రవాణాను అడ్డుకునేందుకు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగరంలోకి వస్తున్న వాహనాలపై ప్రత్యేక నిఘాపెడుతున్నారు.

Hyderabad

దీంతో వీరి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గంజాయి పొడిని పాలలో కలుపుకొని తాగుతున్నారని షాప్‌ ఓనర్‌ చెప్పడం విస్మయం కలిగించింది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఐస్‌క్రీమ్‌లపై హ్యాష్‌ ఆయిల్‌ చల్లి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి గంజాయి చాక్లెట్లు నగరంలోకి ఎక్కువగా వస్తున్నాయి. పోలీసులు అలెర్ట్‌ కావడంతో ఇలా వేర్వేరు పేర్లతో గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే