Hyderabad: హైదరాబాద్‌లోని పబ్బులు, రెస్టారెంట్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బయటపడిన స్టన్ అయ్యే విషయాలు
హైదరాబాదులో పబ్స్ హోటల్స్, రెస్టారెంట్లపై పోలీసులు తనిఖీ చేపట్టారు. కొంతమంది యువత బయట మత్తు పదార్థాలను తీసుకుని పబ్స్‌లోకి రావడంతో తనిఖీలలో భాగంగా వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వారిని తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
హైదరాబాదులో మరోసారి పోలీసులు పబ్స్ హోటల్స్, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో పబ్బులలో తనిఖీలు నిర్వహించగా కొంతమంది యువత బయట మత్తు పదార్థాలను తీసుకుని పబ్స్‌లోకి రావడంతో తనిఖీలలో భాగంగా వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వారిని తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ కొంతమంది పోలీసులను కూడా లెక్కచేయకుండా మాదకద్రవ్యాలను సేవించి పబ్స్‌లోకి వస్తున్నారు. అంతేకాకుండా రూల్స్‌ని అతిక్రమించి కొన్ని పబ్బులు అర్ధరాత్రి వరకు నడిపిస్తున్నారు. దీంతో పోలీసులు బార్ రెస్టారెంట్లు హోటల్లో పబ్స్ మీద మరోసారి పూర్తిస్థాయి తనిఖీలను చేపట్టారు.
నగరంలో డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్‌లోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, హోటల్లు లైసెన్సులను చెక్ చేశారు. బార్లు, పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్ పోలీస్ పర్మిషన్ జీహెచ్ఎంసీ పరిమిషన్లను పోలీసులకు క్షుణ్ణంగా పరిశీలించారు. మైనర్లకు అనుమతి ఇచ్చి లిక్కర్‌ను సప్లై చేస్తే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పబ్బులలో డ్రగ్స్‌తో సహా ఇతర మాదకద్రవ్యాలను అమ్మితే సీజ్ చేయడంతోపాటు సీరియస్ యాక్షన్‌ను తీసుకుంటామని యజమానులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.