Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతరాయం.. ప్రయాణికుల అగచాట్లు

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. లక్డీకాపుల్‌ స్టేషన్‌లో చాలా సేపటి నుంచి మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏ కారణంతో రైలు ఆగిపోయిందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతరాయం.. ప్రయాణికుల అగచాట్లు
Hyderabad Metro Rail

Edited By:

Updated on: Nov 11, 2022 | 2:42 PM

హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. పంజాగుట్ట స్టేషన్‌లో చాలా సేపటి నుంచి మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏ కారణంతో రైలు ఆగిపోయిందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.  అయితే రైళ్లు తిరిగి బయల్దేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్‌ చేస్తున్నారు.  మరోవైపు ఉన్నట్లుండి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దీనిపై మెట్రో రైలు అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా సాంకేతిక కారణాలతో మెట్రో రైలు ఆగిపోవడం ఇటీవల తరచూ జరుగుతోంది. కొన్ని రోజలు క్రితం నాంపల్లి, ముసారాంభాగ్ స్టేషన్లలోనూ సాంకేతిక కారణాలతో మెట్రో సర్వీసులు ఆగిపోయి. ప్రతీనెలలో దాదాపు 2 లేదా 3 సార్లు ఇలా సాంకేతిక లోపం తలెత్తున్నట్టు ప్రయాణీకులు చెబుతున్నారు.

కాగా ఈ నెల 4 తేదీన రైళ్లు ఉదయం చాలా సమయం పాటు మెట్రో సర్వీసులు కదల్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమంటూ చాలా సేపు రైళ్లను ఆపేశారు. రద్దీ బాగా ఉన్న సమయంలో అనుకోకుండా రైళ్లు ఆగిపోతుండడంతో  తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. మెట్రో రైల్ సేవలకు అంతరాయం కలగడంపై సోషల్ మీడియా వేదికగానూ ప్రయాణీకులు తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మెట్రో ప్రయాణీకుడి ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..