Hyderabad: శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్దం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్‌ నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకూ వైభవంగా జరిగేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎన్నికల వేళ కావడంతో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్‌లతో యాత్రను ప్రతిక్షణం పర్యవేక్షించనున్నారు.

Hyderabad: శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్దం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Sri Rama Shobha Yathra
Follow us

|

Updated on: Apr 17, 2024 | 7:28 AM

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్‌ నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకూ వైభవంగా జరిగేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎన్నికల వేళ కావడంతో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్‌లతో యాత్రను ప్రతిక్షణం పర్యవేక్షించనున్నారు.

నేడు శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా రామాలయాలు కళకళలాడుతున్నాయి. వీధివీధికి సీతారాముల కల్యాణం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు. హైదరాబాద్‌ లో ముఖ్యంగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను వైభవంగా జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర ప్రారంభమైన శోభాయాత్ర.. బోయిగూడ కమాన్, గంగాబౌళి ఎక్స్ రోడ్, గాంధీ స్టాట్యూ, బేగంబజార్, ఆంధ్రా బ్యాంక్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనుంది. శోభాయాత్రలో దేవతామూర్తుల భారీ ప్రతిమలు ఆకట్టుకోనున్నాయి. శోభాయాత్రలో 70వేల నుంచి లక్ష వరకూ భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతంగా జరిగేలా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు హైదరాబాద్‌ పోలీసులు. యాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖల అధికారులతో నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. ఇప్పటికే శోభాయాత్ర జరిగే రూట్‌లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా శోభాయాత్ర ప్రారంభించి రాత్రి 10గంటలకల్లా ముగించాలని నిర్వాహకులకు సూచించారు. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకూడదని, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంటోల్ నుంచి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో యాత్రను ప్రతి క్షణం పర్యవేక్షిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు. భక్తులు పండుగ వాతావరణంలో శోభాయాత్రను జరపుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి