AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

వేగం, మద్యం మత్తు ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అతివేగంగా వెళ్తున్న కేటీఎం డ్యూక్‌ బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగరంలోని నార్సింగి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌
Hyderabad KTM Bike Accident
Srilakshmi C
|

Updated on: Jun 18, 2026 | 11:46 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్‌ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్‌ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌ను నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం కారణంగా బైక్‌పై నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుమధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్‌ పూర్తిగా ధ్వంసమైపోగా, బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్‌పై వెనుక కూర్చున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని షాదాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా బాధితులే మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీయడం గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో వారు తమ ప్రయాణాన్ని మొబైల్‌లో వీడియో తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మరే ఇతర వాహనం ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. బైక్‌ ఎంత వేగంతో వెళ్తోందనే విషయాన్ని సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాల ఆధారంగా నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే బైక్‌ అత్యంత వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

కాళీమందిర్‌, టీఎస్పీఏ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, వేగ పరిమితులను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందని, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

Follow Us
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?