AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMDC Marathon: హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌.. పాల్గొన్న ఈశా బ్రహ్మచారులు, వాలంటీర్లు

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగింది. ఈ మారథాన్‌ను నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మారథాన్‌లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు..

NMDC Marathon: హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌.. పాల్గొన్న ఈశా బ్రహ్మచారులు, వాలంటీర్లు
Nmdc Marathon
Subhash Goud
|

Updated on: Aug 25, 2024 | 6:41 PM

Share

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగింది. ఈ మారథాన్‌ను నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మారథాన్‌లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు ఎంతగానో దోహదం చేస్తోందని తెలిపారు. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రన్నర్స్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ మారథాన్‌కు మద్దతుగా ఈశా ఫౌండేషన్‌కు చెందిన బ్రహ్మచారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు అయ్యారు. ఈ మారథాన్‌లో గెలిచిన రన్నర్స్ కు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందించారు.

ఇదిలా ఉండగా, ఈశా పౌండేషన్‌ విద్య పై అవగాహన ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో 31 ఈశా బ్రహ్మచారులతో పాటు 170 కి పైగా మద్దతుదారులు NMDC మారథాన్‌లో పాల్గొన్నారు. వారు 42 కిమీ పూర్తి మారథాన్, 21 కిమీ హాఫ్ మారథాన్‌లో, 10K రన్ లలో పాల్గొన్నారు.

Nmdc

సద్గురు స్థాపించిన ఈశా ఫౌండేషన్ వారు సామాజిక అభివృద్ది కోసం ఈశా ఔట్రీచ్ అనే విభాగం ద్వారా ఏపీ, తమిళ నాడులో 10 ఈశా విద్య పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా విద్యను అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుండి 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్య పాఠశాలల్లో చదువుకున్నారు. వీరిలో 60% కంటే ఎక్కువ మంది విద్యార్థులు` వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్‌షిప్‌ల ద్వారా విద్యనభ్యసిస్తున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీజులు చెల్లిస్తున్నారు.

మౌళిక సదుపాయాలు:

పాఠశాలలలో మౌళిక వసతులతో విశాలంగా ఉన్న తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం వారికి అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉండేలా పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంతే కాదు విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పిల్లలు క్రీడలలో ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా ఆచరణాత్మక అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్‌రూమ్‌ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహనను కల్పిస్తూ, వారి నైపుణ్యాలను పెంపొందించేలా ఈశా విద్య పాఠశాలలు కృషి చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి