Hyderabad: లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. మూసీకి భారీగా ప్రవాహం.. నిండుకుండల్లా జంట జలాశయాలు
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. వారం రోజులు క్రితమే ఎడతెరిపి లేకుండా కురిసిన వానల ఘటనను మరిచిపోకముందే ఇప్పుడు మళ్లీ వానలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిన్న...
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. వారం రోజులు క్రితమే ఎడతెరిపి లేకుండా కురిసిన వానల ఘటనను మరిచిపోకముందే ఇప్పుడు మళ్లీ వానలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో గేట్లు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువుకు భారీగా వరద వస్తోంది. కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఈ చెరువుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
కాగా.. వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దంచికొడుతున్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారు జామునుంచి మొదలైన ఎడతెరపి లేకుండా రాత్రివరకూ కురుస్తూనే ఉంది. నైరుతి ఋతుపవనాలతో పాటు, ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు (జూలై 27వ తేది) వరకూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిలిగిన జిల్లాల్లో కొన్నిటికి ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..