AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రగ్స్ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో అసలేం జరుగుతోంది.. కెవిన్‌ మృతికి కారణం ఎవరు..?

హైదరాబాద్‌ డ్రగ్‌ ఎడిక్టర్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లు మృత్యుసెంటర్‌లుగా మారుతున్నాయా? కెవిన్‌ మృతికి కారణం రిహాబిలిటేషన్‌ సెంటరే కారణమా? ఇదే అనుమానం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.

Hyderabad: డ్రగ్స్ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో అసలేం జరుగుతోంది.. కెవిన్‌ మృతికి కారణం ఎవరు..?
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2023 | 12:02 PM

Share

హైదరాబాద్‌ డ్రగ్‌ ఎడిక్టర్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లు మృత్యుసెంటర్‌లుగా మారుతున్నాయా? కెవిన్‌ మృతికి కారణం రిహాబిలిటేషన్‌ సెంటరే కారణమా? ఇదే అనుమానం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది. తిరుమల గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గాంధీనగర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఇటీవల మృతి చెందిన కెవన్‌ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. రిహాబిలిటేషన్‌ సెంటర్‌పై స్థానికుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా స్థానికులను హడలెత్తిస్తోన్న రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో అసలేం జరిగింది? కెవిన్‌ అనే యువకుడి మృతి హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. గంజాయికి బానిసైన కెవిన్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం సెరినిటి ఫౌండేషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే ముందు కెవిన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ సెరినిటి ఫౌండేషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ వెల్లడించింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో తమ కొడుకుది ఆత్మహత్య కాదనీ, అది హత్యేనని కెవిన్‌ తల్లి ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది.

గంజాయికి బానిసైన కెవిన్‌ అనే యువకుడిని 2022 ఫిబ్రవరి 20న గాంధీనగర్‌లోని సెరినిటి ఫౌండేషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్పించారు. జనవరి 26న కత్తితో గొంతు కోసుకుని కెవిన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి కుటుంబ సభ్యులకు కాల్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు సెంటర్‌కి చేరుకునే సరికే కెవిన్‌ మరణించాడు. అయితే ఇది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ మర్డరేనని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు.. నలుగురు కలిసి తమ కొడుకుని హత్యచేశారని ఆరోపిస్తున్నారు.

అయితే కెవిన్‌ మృతితో గతంలోని ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. కెవిన్‌ మృతి కచ్చితంగా హత్యేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో అనుమానాస్పద ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. రిహాబిలిటేషన్‌ సెంటర్‌ పేరుతో జరుగుతోన్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడంటున్నారు స్థానికులు. ఆర్కే పురంలోని ఆశ కాలనీలో ఉన్న సెరినీటి రిహాబిలిటేషన్ సెంటర్ లో సిబ్బందిని ఇదే విషయమై ప్రశ్నిస్తే.. ర్యాష్‌గా సమాధానమిస్తున్నారు సెంటర్‌ సిబ్బంది.

ఇవి కూడా చదవండి

అయితే.. కెవిన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రిహాబిలిటేషన్‌ సెంటర్‌ చెపుతోంటే.. తమ కొడుకుది ఆత్మహత్యకాదు.. హత్యేనంటున్నారు కెవిన్‌ తల్లి. ఇంతకీ ఇది సూసైడా? మర్డరా? కెవిన్‌ మరణానికి కారణమేమిటి..ఇదే ఇప్పుడు నిగ్గుతేలాల్సిన నిజం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..